పాయల్ రాజ్ పుత్ పక్కదారి పడుతోందా ..?

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే మంచి సక్సస్ ని అందుకుంది. ఈ సినిమాలో పాయల్ పర్ఫార్మెన్స్ కి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కార్తికేయ హీరోగా నటించాడు. లిప్ లాక్స్.. హాట్ సీన్స్ లో అదరగొట్టిన పాయల్ కి ఇండస్ట్రీలో ఇక తిరుగుండదని అందరు భావించారు. అనుకున్నట్టుగా ఆర్ ఎక్స్ 100 తర్వాత దాదాపు అర డజను సినిమా అవకాశాలు పాయన్ ని వరించాయట.

RX100 Heroine Payal Rajput Photos Photos | RX100 Heroine Payal Rajput  Photos Photo Gallery - Photo 1

కాని అన్నీ కథ లలో ఆర్ ఎక్స్ 100 సినిమా తరహా లోనే లిప్ కిస్ లు.. అందాల ప్రదర్శన చేయాలని ఉండటమే పాయల్ కి నచ్చకపోవడం తో ఆ కథ లని రిజెక్ట్ చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇలా రిజెక్ట్ చేయడానికి కారణం పాయల్ మంచి కమర్షియల్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకోవాలనుకోవడమేనట. ప్రతీ సినిమాలో అవసరం ఉన్నా లేకపోయినా బోల్డ్ గా నటించడం ఇష్టం లేకనే నిర్మొహమాటంగా పాయల్ తన వద్దకి వచ్చిన అవకాశానికి నో చెప్పింది.

కాగా ఆ తర్వాత కూడా తప్పని పరిస్థితుల్లో ఆర్ డి ఎక్స్ లవ్ అన్న సినిమా చేసింది. ఈ సినిమాలో కాన్సెప్ట్ బావున్నప్పటికి అది అంతగా జనాలని ఆకట్టుకోకపోవడం పాయల్ కి మైనస్ అయింది. దాంతో పాయల్ ఆశించిన అవకాశాలు దక్కడం లేదు. విక్టరీ వెంకటేష్ – నాగ చైతన్య ల మల్టీస్టారర్ వెంకీమామ, మాస్ మహా రాజా రవితేజ డిస్కో రాజా సినిమాలు చేసినా పాయల్ కెరీర్ కి పెద్దగా ఉపయోగపడలేదు. అందుకే ఇప్పుడు ప్రయోగాలు చేస్తోంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఓ అతిథి’.

Payal rajput Anaganaga Oka Athidhi Movie Stills | oktelugu - Part 13

ఈ సినిమాలో పాయల్ ‘మల్లిక’ అనే పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుండగా చైతన్య కృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. పీరియాడికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ లో నవంబర్ 20న విడుదల కానుంది. ధైర్యం చేసి ఈ సినిమా చేసిన పాయల్ ఈ సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకుందట.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ తో పాయల్ కొత్త తరహా పాత్రలో బాగానే ఆకట్టుకుంది. మరి ఈ ప్రయోగం తో అయినా టాలీవుడ్ లో పాయల్ ఫేట్ మారుతుందేమో చూడాలి. ఇక ఈ సినిమా కి పాయల్ అందుకున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. అవకాశాలు అంతగా లేకపోయినా కూడా ఈ సినిమాకి పాయల్ 70 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుందని అంటున్నారు.