Home News మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కి అంత సీన్ లేదా ..?

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కి అంత సీన్ లేదా ..?

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ .. అక్కినేని అఖిల్ నటిస్తున్న నాలుగవ చిత్రం. ఇప్పటికే అఖిల్, హలో, మిస్టర్ మజ్ఞు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని ఒక్క సినిమా తో కూడా మెప్పించలేకపోయాడు. ప్రతీసారి ఎన్నో నమ్మకాలు పెట్టుకుంటే అఖిల్ కి డిసప్పాయింట్‌మెంట్ తప్ప ఏమీ మిగల్లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అంటూ ఇప్పుడు నాలుగవ సినిమాతో రెడీ అవుతున్నాడు. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు.

Mr Majnu Movie Review: Akhil Akkineni Shines In Venky Film But Not Bright  Enough - Movies News

వాస్తవంగా ఈ సినిమా లో కంప్లీట్ అయిన కొన్ని సెంకండాఫ్ సీన్స్ ని రీ షూట్ చేయడం వల్లే సినిమా లేట్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కి చాలాకాలంగా హిట్స్ లేవు. ఇక అఖిల్ సినిమాల విషయం తెలిసిందే. అందుకే అటు భాస్కర్, ఇటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో అఖిల్ కి జంటగా పూజా హెగ్డే నటించింది. అయితే గత నెలలో ఈ సినిమాని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరిలో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ చెప్పుకొచ్చారు.

Akhil'S Role In His Next Revealed!

కాని ప్రస్తుతం ఈ సినిమా సంక్రాంతికి వచ్చేంత సీన్ లేదని చెప్పుకుంటున్నారు. ఇంకా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కంప్లీట్ కాలేదని సమాచారం. అందుకే సంక్రాంతికి రిలీజ్ చేయలేకపోతున్నారట. ఇక ఈ సినిమాను జీఏ2 భానర్ పై బన్నీవాసు .. వాసు వర్మ నిర్మిస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. మరి ఈ సినిమా అఖిల్ కి ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి. కాగా అఖిల్ ఈ సినిమా తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Posts

మద్యం మత్తులో షణ్ముఖ్ హల్‌ చల్.. కార్లు, బైకులను ఢీకొట్టి బీభత్సం !

మద్యం మత్తులో టిక్‌టాక్‌ స్టార్ షణ్ముఖ్ హల్‌చల్ సృష్టించాడు. అతివేగంగా కారు నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. జూబ్లీహిల్స్ వుడ్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు, బైకులను ఢీకొట్టి...

అమెరికా ఇండియాకి ఎన్ని లక్షల కోట్లు బాకీ ఉందంటే ?

అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న. ప్రపంచంలోని చాలా దేశాలకు అప్పులిస్తుంది. అయితే, ఆ దేశం కూడా అప్పులు చేస్తుంది. అంతా ఇంతా కాదు. భారీ ఎత్తున అప్పులు చేస్తోంది. అభివృద్ది చెందిన దేశంగా...

మూడో కూటమిగా కమల్‌హాసన్-శరత్‌ కుమార్… రంజుగా మారుతున్న తమిళ రాజకీయం!

చెన్నై: డీఎంకే కూటమి నుంచి నటుడు శరత్‌ కుమార్‌ బయటకు వచ్చి కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీతో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాలలో రోజురోజుకు వేడి...

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు … మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో బరిలో 93 మంది !

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. నామినేషన్ల పరిశీలనలో కొంతమంది నామినేషన్లు రిజక్ట్ కాగా , నామినేషన్ల ఉపసంహరణలో కొంతమంది విత్ డ్రా చేసుకున్నారు. మహబూబ్‌నగర్-...

Latest News