Mega Star:మెగాస్టార్ మరో రీమేక్ సినిమా చేయబోతున్నాడా..?

 

Mega Star:Mega Star: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో యువ హీరోలతో సమానంగా ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి తీసిన ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది.మరోవైపు వేదాళమ్ రీమేక్ భోళా శంకర్‌, లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సెట్స్ పై ఉన్నాయి.  ఇవి కాకుండా మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో 154వ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా,మైత్రి మూవీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వీటితో పాటు చిరంజీవి మరో మలయాళ సినిమా పైన మనసు పారేసుకున్నట్టుగా తెలుస్తోంది. మలయాళంలో ఈ ఏడాది విడుదలై బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేసిన బ్రో డాడీ సినిమాని తెలుగులో రీమేక్‌ చేయాలని చిరంజీవి భావిస్తున్నారట.మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లొ నటించిన బ్రో డాడీ మూవీని తెలుగులో వెంకటేష్, రానా కలిసి చేయాలని అనుకున్నారట.

ఇప్పటికే ఈ సినిమాను తెలుగు రీమేక్ హక్కులను నిర్మాత దగ్గు పాటి సురేష్ బాబు సొంతం చేసుకున్నారు.కాగా, బ్రో డాడీ మూవీ చిరంజీవికి నచ్చడంతో దానిని తెలుగులో రీమేక్‌ చేసేందుకు ఆయన ఇష్టపడుతున్నట్లుగా సమాచారం.మరి ఎవరూ ఆ సినిమాను చెస్తారొ చూడాలి.., ఈ సినిమాలో చిరంజీవి గనుక చేస్తే ఖాతా లో ఇంకొక రీమేక్ సినిమా చేరుతుంది.