మెగాస్టార్ చిత్రంలో శర్వానంద్‌!

కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ‘బ్రో డాడీ’ రీమేక్‌కు సంబంధించి రెండో హీరో విషయంలో కొన్ని రోజులుగా వార్తలు బాగా వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవికి కుమారుడిగా యంగ్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించబోతున్నట్లుగా మొదటి నుంచి వార్తలు వినపిస్తూనే ఉన్నాయి. కానీ, సిద్దు ఆ పాత్రలో చేయనని చెప్పడంతో.. ఆ ప్లేస్‌లో శర్వానంద్‌ని ఓకే చేసినట్లుగా తెలిసింది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ’భోళా శంకర్‌’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్ట్‌ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా యమ జోరుగా నిర్వహిస్తున్నారు.

అయితే ఈ సినిమా తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి రెండు సినిమాలకు ఓకే చెప్పినట్లుగా సమాచారం. అందులో ఒకటి కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ‘బ్రో డాడీ’ రీమేక్‌ కాగా.. రెండోవది ‘బింబిసార’దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ఉండబోతుందనేలా టాక్‌ వినిపిస్తోంది. అయితే కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ‘బ్రో డాడీ’ రీమేక్‌కు సంబంధించి రెండో హీరో విషయంలో కొన్ని రోజులుగా వార్తలు వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. చిరుకు కొడుకు పాత్రలో వరుణ్‌ తేజ్‌ అయితే న్యాచురల్‌గా బాగుంటుందని కొందరు సలహాలు ఇస్తున్నప్పటికీ.. కార్తికేయ ఇలా కొందరి పేర్లు వినిపించాయి. తాజాగా ఇప్పుడా ప్లేస్‌లో మరో యంగ్‌ హీరో పేరు యాడయింది.

ఆ హీరో మరెవరో కాదు శర్వానంద్‌ . శర్వానంద్‌కి మెగా ఫ్యామిలీతో మంచి బాండిరగ్‌ ఉన్న విషయం తెలియంది కాదు. రామ్‌ చరణ్‌ , శర్వానంద్‌ మంచి స్నేహితులు. చిరంజీవి కూడా పలు సందర్భాలలో శర్వా నా బిడ్డలాంటి వాడని ప్రకటించారు. మా ఇంట్లోనే పెరిగాడని కూడా అన్నారు. చిరంజీవి ‘శంకర్‌దాదా జిందాబాద్’ ’ చిత్రంలో శర్వానంద్‌ ఇప్పటికే నటించి ఉన్నారు. ఇప్పుడు మరోసారి శర్వాకి చిరు సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది. ‘బ్రో డాడీ’ రీమేక్‌లో చిరంజీవి కుమారుడి పాత్రలో శర్వానంద్‌ దాదాపు ఖరారు అయినట్లే అని తాజాగా ఓ వార్త టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వైరల్‌ అవుతోంది. మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజైన ఆగస్ట్‌ 22న ఈ సినిమాని అధికారికంగా ప్రకటించబోతున్నట్లుగా సమాచారం.