చిరుకి జోడీ.. తల్లి పాత్ర కాదంట

మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి భోళా శంకర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. సుస్మిత కొనెదల ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ కాంబినేషన్ లో వచ్చిన బ్రో డాడీ రీమేక్ గానే ఈ చిత్రం తెరకెక్కుతోందనే ప్రచారం కూడా నడుస్తోంది.

అయితే ఒరిజినల్ కథని అలాగే ఉంచకుండా కొన్ని కీలక మార్పులు చేసారంట. బ్రో డాడీ చిత్రం అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుంది. ఈ చిత్రాన్ని కూడా ఫ్యామిలీ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గానే సిద్ధం చేసారంట. అయితే మాతృకలో మోహన్ లాల్ భార్యగా మీనా నటించారు. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ కి జోడీగా త్రిషని ఎంపిక చేసారంట.

ఇక చిరంజీవి కొడుకుగా సిద్దు జొన్నలగడ్డ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే త్రిష పోషించేది మెగాస్టార్ జోడీగా అయిన సిద్ధూ తల్లి పాత్రలో కాదంట. మెగాస్టార్ కి రెండో భార్య పాత్రలో ఆమె కనిపించనుందని టాక్. తండ్రికి రెండో పెళ్లి చేయడం కోసం త్రిషని సిద్దు ఎంపిక చేసి ఆమె ప్రేమలో పడే విధంగా సిద్దు చేసే విన్యాసాలు ఈ మూవీలో కీలకంగా ఉంటాయంట. అవుట్ అండ్ ఔన్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే ఈ కథని ప్రసన్న కుమార్ సిద్ధం చేసారంట.

అయితే కథ పరంగా చూసుకుంటే గతంలో శ్రీకాంత్, కృష్ణంరాజు చేసిన మా నాన్నకు పెళ్లి, మెగాస్టార్ చిరంజీవి అందరివాడు ఛాయలు కనిపిస్తున్నాయి. ఆ రెండు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. మళ్ళీ ఇంచు మించు అలాంటి కథనే తీసుకొని ఫుల్ ఎంటర్టైన్మెంట్ మోడ్ లో చెప్పబోతున్నట్లు టాక్. సిద్దు అంటే ఫన్ కి తిరుగుండదు. ఇక మెగాస్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్ వర్క్ లాంటివి ఉండవు కాబట్టి మూడు నెలల్లో షూటింగ్ ఫినిష్ చేసి సంక్రాంతి కి రిలీజ్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నారంట. గుంటూరు కారం మూవీ కూడా వేసవికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అలాగే ప్రాజెక్ట్ కె కూడా వాయిదా పడొచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి చిరంజీవికి స్పేస్ దొరికే ఛాన్స్ ఉండొచ్చని భావించి ఇలా ప్లాన్ చేస్తున్నారంట.