సెకండ్ ఇన్నింగ్స్‌లో రీమేకుల మీద రీమేకులు చేసుకుంటూ పోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఫ్యాన్స్ వద్దు మొర్రో అని ఎంత గోల చేస్తున్నా వినిపించుకోవడం లేదు. ఇంతవరకూ ఏదో బాగానే నడించింది కానీ, ‘భోళా శంకర్’ రిజల్ట్ కాస్త అటూ ఇటూ కావడంతో, చిరంజీవి రియలైజ్ అయ్యారనీ ఇన్‌సైడ్ సోర్సెస్ టాక్.
ఇకపై రీమేక్‌ల జోలికి వెళ్లకూడదనుకుంటున్నారట. రీమేకుల విషయంలో పెద్ద చర్చే నడుస్తోంది ఈ మధ్య. మంచి కంటెంట్ వున్న సినిమాల్నీ అన్ని భాషల్లోనూ అందిస్తే తప్పేముంది.. అనేది నటీనటుల అభిప్రాయం. అవును నిజమే, కానీ ఓటీటీ ట్రెండ్ నడుస్తున్న నయా డేస్‌లో భాషతో సంబంధం లేకుండా ఓటీటీలో అందుబాటులో వుంటోంది ఏ కంటెంట్ అయినా.
ఇలాంటి టైమ్‌లో మళ్లీ రీమేకులు అవసరమా.? అయితే, చిరంజీవి కోసం ఆల్రెడీ ‘బ్రోడాడీ’ అనే మలయాళ మూవీ రీమేక్ హక్కుల్ని లాక్ చేసి పెట్టాడు రామ్ చరణ్. మైత్రీ వాళ్లతో కలిసి ఈ సినిమాని హోమ్ బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్‌లో నిర్మించేందుకు రామ్ చరణ్ సిద్ధంగా వున్నాడు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు డైలమాలో పడిందట. చూడాలి మరి, ఏం జరుగుతుందో.