అఖిల్ అందుకే పూజా హెగ్డే, రష్మిక మందన్న లని ఫిక్స్ చేసుకున్నాడా ..?

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ గా వెలుగుతున్నారు పూజా హెగ్డే, రష్మిక మందన్న. సినిమాలు కమిటవడం లోను, తీసుకునే రెమ్యూనరేషన్ విషయంలోనూ ఇద్దరి మధ్య పెద్ద తేడా లేదంటున్నారు. అందుకు కారణం ఈ ఇద్దరు లక్కీ హీరోయిన్స్ అని ఫేం రావడమే. ఇప్పటి వరకు ఈ ఇద్దరు హీరోయిన్స్ నటించిన సినిమాలు దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలందరికి పూజా హెగ్డే .. రష్మిక మందన్న లక్కీ హీరోయిన్స్ అయ్యారు.

దాంతో కొంతమంది హీరోలు గాని మేకర్స్ గాని ఈ హీరోయిన్స్ సినిమాలో ఉంటే పక్కా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్సవుతున్నారు. అలాగే అఖిల్ అక్కినేని కూడా ఫిక్సైయ్యాడని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం సెట్స్ మీదున్న అఖిల్ 4 వ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాలో పూజా హెగ్డే ని హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఈ సినిమా కి పూజా హెగ్డే ని ఎంచుకున్నప్పుడే చాలా మంది సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్సైయ్యారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా అఖిల్ 5 వ సినిమాని సురేందర్ రెడ్డి దర్శకత్వం లో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. 2021 జనవరి నుంచి ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో అఖిల్ కి జంటగా ఈ సినిమాలో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న ని ఎంచుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సక్సస్ కొట్టాలన్న ఉద్దేశ్యంతోనే అఖిల్ వరసగా పూజా హెగ్డే, రష్మిక మందన్న లని హీరోయిన్స్ గా సెలెక్ట్ చేసుకున్నాడని అంటున్నారు.