Jabardasth : జబర్దస్త్ లో ఇక ఆ కంటెస్టెంట్ కనిపించడా… జబర్దస్త్ మసకబారుతోందా….!

Jabardasth : జబర్దస్త్ ద్వారా తెలుగు తెరకు ఎంతోమంది పరిచయమై ఎపుడు కమెడియన్స్ గా బాగా సెటిల్ అయ్యారు. అలాంటి వారిలో హైపర్ ఆది ముందుంటారు.హైపర్ ఆది పంచులు, డబుల్ మీనింగ్ డైలాగులకు బాగా ఫేమస్. ఇక ఆది కు ఫ్యాన్ బేస్ కూడా బాగా ఎక్కువ. ఇక సినిమాల్లో కూడా మంచి అవకాశాలు వచ్చిన ఆది జబర్దస్త్ ను మాత్రం వీడలేదు.

ఇక ఈ మధ్యనే రోజా జబర్దస్త్ కు వీడ్కోలు చెప్పింది. మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకోవడంతో సినిమాలకు, జబర్దస్త్ కు రోజా వీడ్కోలు చెప్పక తప్పలేదు. ఇక 2019 లో నాగబాబు జబర్దస్త్ వీడాక ఇక జబర్దస్త్ డౌన్ అయిపోతుందని అందరు అనుకున్నారు. కానీ జబర్దస్త్ మాత్రమే తగ్గేదేలే అన్నట్టు గా సాగింది దీనికి కారణం మూలస్తంబాల్లాంటి కంటెస్టెంట్స్ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ , రాఘవ వంటి వారు.

ఇపుడు జబర్దస్త్ లో కీలక కంటెస్టెంట్ అయిన హైపర్ ఆది మూడు వారాలుగా షో లో కనిపించక పోవడంతో అందరు హైపర్ ఆది ఇక జబర్దస్త్ కు రాడు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అదే జరిగితే జబర్దస్త్ జోరు ఈ మధ్యకాలం లో బాగా తగ్గింది ఇక ఆది వంటి స్టార్ కమెడియన్స్ కూడా దూరమైతే అది జబర్దస్త్ టీఆర్పి రేటింగ్స్ పై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఇక జబర్దస్త్ యాజమాన్యం మల్లెమాల ఇప్పటికైనా జాగ్రత్తగా పడితే మంచిది.