రకుల్ ని నమ్మి రంగంలోకి దిగిన దర్శకుడు భారీ షాక్ ..?

నాగార్జున నటించిన మన్మధుడు2 తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు కరువైన రకుల్ ప్రీత్ సింగ్ కి అదృష్ఠం కొద్ది టాలీవుడ్ లో అద్భుతమైన అవకాశం దక్కింది. ఏకంగా స్టార్ డైరెక్టర్ క్రిష్ – మెగా హీరో వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం లో రకుల్ ని ఎంచుకున్నాడు క్రిష్. ఇందుకు కారణం ఈ సినిమాని సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేయాలని క్రిష్ టార్గెట్ పెట్టుకోవడమే.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రిష్ సింగిల్ షెడ్యూల్ సినిమా కంప్లీట్ చేయాలంటే పూజా హెగ్డే, రష్మిక లాంటి వాళ్ళని తీసుకుంటే కుదరదు. అంతకంటే కొత్తవాళ్ళంటే ప్రాజెక్ట్ కి గ్రాండ్ నెస్ రాదు. కాబట్టి సినిమాలు లేకపోయినా టాలీవుడ్ లో అవకాశాలు లేని రకుల్ అయితే క్రిష్ అనుకున్నట్టుగా బల్క్ డేట్స్ ఇచ్చి సినిమా కంప్లీట్వడానికి సహకరిస్తుందని నమ్మి హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నాడు. కాని ఇప్పుడు ఇదే క్రిష్ కి పెద్ద షాక్ లా అనిపిస్తుందని చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ పేరు ముడిపెట్టడంతో ఎన్సీబీ అధికారుల ముందు హాజరవ్వాల్సి వస్తోంది. ఈ తతంగం ఒక్క రోజులో ముగిసేది కాదు. దాంతో కొన్నాళ్ళు ముంబై లోనే రకుల్ ఉండాల్సి వస్తుందంటున్నారు. దాంతో సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేసి పవన్ కళ్యాణ్ సినిమాని స్టార్ట్ చేయాలనుకున్న క్రిష్ కి అది సాధ్యపడటం కాస్త కష్టమే అంటున్నారు. అంతేకాదు బాలీవుడ్ లో రెండు సినిమాలతో పాటు కోలీవుడ్ లో శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఇండియన్ అన్న పాన్ ఇండియన్ సినిమాని చేస్తుంది. ఇప్పుడు క్రిష్ తో పాటు ఈ సినిమాల మేకర్స్ కి ఏమి చేయాలన్నది అర్థం కావడం లేదని అంటున్నారు.