అనుష్కకి ఆ ఆలోచనే లేదంట.!

అనుష్క శెట్టి.. ఏదో ఆబ్లిగేషన్ మీద మాత్రమే ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమాకి సైన్ చేసింది తప్ప, ఆమెకు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ లేదని గతంలోనే గాసిప్స్ వినిపించాయి. ఇంతకీ, అనుష్క మనసులో ఏముంది.? అనుష్క మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అవుతుందన్న ప్రచారంలో నిజమెంత.? ఈ విషయమై ఇటీవల ఓ ప్రముఖ నిర్మాత, అనుష్క శెట్టితో మాట్లాడినప్పుడు, ‘ఔను అనిగానీ, కాదు అనిగానీ’ ఆమె చెప్పలేదట.

అనుష్కతో సినిమాలు చేయాలని దర్శక నిర్మాతలు ఉవ్విళ్ళూరడంలో వింతేముంది.? సినిమాలు తగ్గించేసినా, ఆమె స్టార్‌డమ్ అలాగే వుంది. అదే అనుష్క ప్రత్యేకత.

ఆ గౌరవాన్ని అలాగే నిలబెట్టుకోవాలనుకుంటోందిట అనుష్క. అంటే, సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చేసిందన్నమాట. కానీ, ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంలేదంతే. ఎందుకిలా.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.