లైగర్ కోసం అనన్య రెమ్యునరేషన్ మరీ అంత తక్కువనా?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న మొట్టమొదటి చిత్రం లైగర్.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.ఇకపోతే ఈ సినిమా ఈనెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం పలు రాష్ట్రాలలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం నటీనటులు తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఏకంగా 35 కోట్ల రూపాయల పారితోషకం తీసుకోగా హీరోయిన్ అనన్య పాండేకు మాత్రం చాలా దారుణంగా రెమ్యూనరేషన్ ఇచ్చారని చెప్పాలి.ఈ సినిమా కోసం ఈమెకు కేవలం మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం.

ఇక అనన్య పాండే చాలా తక్కువ రెమ్యూనరేషన్ కి ఈ సినిమాలో నటించినట్టు తెలుస్తోంది.ఈమె హీరోతో పోలిస్తే చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ తన కెరియర్ బిల్డ్ చేసుకోవడం కోసం ఇలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినిమాలలో నటిస్తున్నారని తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ కొట్టేలాగే ఉంది. ఈ సినిమా మంచి హిట్ కొడితే ఈమెకు మాత్రం వరుస అవకాశాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.