సమంత సామ్ జామ్ లో అల్లు అర్జున్ .. పుష్ప ప్రమోషన్స్ కి వచ్చాడా ..?

సమంత ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా కమిటవలేదు. జాను డిజాస్టర్ తర్వాత సొంత కథల ఎంపిక లో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలో నే ఇంకా సమంతని మంచి కథ తో ఎవరూ ఇంప్రెస్ చేయలేదని సమాచారం. అయితే సక్సస్ ఫుల్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 లో మాత్రం ఒక ముఖ్య పాత్ర పోషించింది. నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ లో కనిపించబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఫస్ట్ సీజన్ కి మంచి ప్రేక్షకాధరణ లభించడంతో ఇప్పుడు ఫ్యామిలీ మాన్ 2 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

Samantha Akkineni to foray into digital space with The Family Man Season 2?  | Entertainment News,The Indian Express

ఇక మొదటిసారి సమంత ఈ వెబ్ సిరీస్ లో తన పాత్ర కి తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంది. కాగా ఇటీవలే ఒక తమిళ సినిమా షూటింగ్ లో జాయిన్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తుండగా కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడట. ముక్కోణపు ప్రేమకథ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా నయనతార కాబోయే భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అఫీషియల్ గా సమంత చేస్తున్న సినిమా ఇదొక్కటే అంటున్నారు.

సామ్ జామ్ షో లో మెరిసిన స్టైలిష్ స్టార్ | Allu Arjun Participated in Sam  Jam Show

అయితే బుల్లితెర మీద మాత్రం సమంత సందడి మామూలుగా లేదు. ఆహా లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న సామ్ జామ్ టాక్ షో తో తెగ హంగామా చేస్తోంది. టాలీవుడ్ సెలబ్రిటీస్ తో పాటు పలువురు క్రీడా కారులను ఇంటర్వ్యూస్ చేస్తూ ప్రేక్షకులను టన్నుల కొద్దీ ఎంటర్‌టైన్‌మెంట్ ని ఇస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, విజయ్ దేవరకొండ సహా పలువురు సినిమా స్టార్స్ ని ఇంటర్వ్యూ చేసింది. ఆ ఎపిసోడ్స్ అన్ని ఇప్పటికే ఆహా లో స్ట్రీమింగ్ అయ్యాయి. కాగా త్వరలో అల్లు అర్జున్ తో సమంత చేసిన లేటెస్ట్ ఎపిసోడ్ జనవరి 1 న ఆహా లో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప కి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను తెలపనున్నట్టు సమాచారం. చూడాలి మరి ఈ ఎపిసోడ్ లో సమంత అల్లు అర్జున్ తో ఎలాంటి విషయాలని బయట పెట్టించబోతుందో.