IPL 2025: RCBపై 6 కోట్లు బెట్టింగ్.. జాక్ పాట్ కొట్టేశాడు

ప్రఖ్యాత కెనడియన్ ర్యాప్ సింగర్ డ్రేక్ ఐపీఎల్ 2025 ఫైనల్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు. ఆర్‌సీబీపై వేసిన భారీ పందెం విజయవంతమై ఆయన రూ.11 కోట్లకుపైగా ఆర్జించి ప్రపంచ బెట్టింగ్ వర్గాల్లో సంచలనంగా మారారు. ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఘన విజయం సాధించడంతో డ్రేక్ విజయం కొల్లగొట్టారు.

డ్రేక్ ఈ పందెం వివరాలను మ్యాచ్‌కు ముందు స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రముఖ బెట్టింగ్ సంస్థ ‘స్టేక్’ ద్వారా ఏకంగా 7.5 లక్షల అమెరికన్ డాలర్లు (రూ. 6.41 కోట్లు) ఆర్‌సీబీ విజయంపై పెట్టిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ “ఈసారి కప్ మనదే” అనే క్యాప్షన్ జత చేశారు. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయింది.

మ్యాచ్ ముగిసే సరికి ఆర్‌సీబీ అద్భుత ప్రదర్శనతో టైటిల్ అందుకోవడంతో డ్రేక్‌కు దాదాపు 1.31 మిలియన్ డాలర్లు (రూ. 11.11 కోట్లు) గెలుపు లభించింది. ఇది కేవలం క్రికెట్‌పై కాదు, డ్రేక్‌కు ఉన్న సాహసోపేతమైన నిర్ణయాలపై ఉన్న నమ్మకానికీ సాక్ష్యంగా నిలిచింది. గతేడాది కూడా డ్రేక్ ఐపీఎల్ ఫైనల్‌పై పందెం కాసిన సంగతి తెలిసిందే.

అయితే బెట్టింగ్స్ అనేవి లక్కుతో కూడుకున్నవి అవి అందరికి కలిసి రావు.. కొన్నిసార్లు భారీ ఆదాయం రావచ్చు.. మరికొన్ని సార్లు అంతకంటే ఎక్కువగా కూడా నష్టాలు రావచ్చు. కాబట్టి బెట్టింగ్స్ కు దూరంగా ఉంటే మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఈసారి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పై వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో బెట్టింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది.

Producer Chitti Babu Fires On CM Chandrababu Naidu | NDA Alliance 1 Year Ruling | Pawan Kalyan | TR