“NBK108” నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.!

టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ వరుసగా రెండు భారీ హిట్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన వీరసింహా రెడ్డి తో తన కెరీర్ లో పెద్ద హిట్ ని తాను సొంతం చేసుకోగా ఇక ఇపుడు తన కెరీర్ లో 108 వ సినిమాని అయితే దర్శకుడు అనిల్ రావిపూడితో చేస్తున్నారు.

కాగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా కాజల్ అగర్వాల్ అయితే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తుంది. కాగా ఈ సినిమాలో ఇపుడు ఓ బాలీవుడ్ వెర్సటైల్ నటుడు నటిస్తున్నట్టుగా ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ సినిమాస్ వారు అనౌన్స్ చేశారు.

కాగా ఆ నటుడు మరెవరో కూడా కాదు నేషనల్ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ అట. తాను ఈ సినిమా కీలక పాత్ర చేస్తుండగా ఈ సినిమాతోనే తెలుగు సినిమా అరగేంట్రం చేస్తున్నామని. ఇలాంటి విలక్షణ నటుణ్ని తమ బ్యానర్ నుంచి తెలుగు సినిమాకి పరిచయం చేస్తుండడం ఆనందంగా ఉందని తెలిపారు.

దీనితో ఇప్పుడు అప్డేట్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకి కూడా థమన్ సంగీతం అందిస్తుండగా ఈ ఏడాది దసరా మహోత్సవ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అలాగే బాలయ్య రెండు భిన్నమైన లుక్స్ లో ఈ సినిమాలో కనిపించనున్నారు.