“సలార్” లో ఖాన్సార్ సామ్రాజ్యంపై బాలీవుడ్ మీడియా డీటెయిల్స్.!

ఇపుడు పాన్ ఇండియా సినిమా దగ్గర నెక్స్ట్ లెవెల్ అంచనాలు నెలకొల్పుకున్నా చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ చిత్రం “సలార్” కూడా ఒకటి. మరి ఈ భారీ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా ఈ డిసెంబర్ లో బిగ్గెస్ట్ రిలీజ్ కి రాబోతుంది.

కాగా ఈ సినిమా ట్రైలర్ లో అయితే నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ పై చూపించిన ఖాన్సార్ సామ్రాజ్యం విజువల్స్ ఎలా ఉన్నాయో అందరూ చూసారు. మరి ఈ ఖాన్సార్ లో కూడా కేజీఎఫ్ తరహాలో పవర్ కోసం పోటీ జరుగుతుంది అని కన్ఫర్మ్ చేశారు. అయితే ఇంత హైప్ చేస్తున్న దీనిపై బాలీవుడ్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

కాగా ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర ఏదైతే ఖాన్సార్ ని కాపాడడానికి వస్తాడో తన ఫ్రెండ్ కోసం మళ్ళీ అదే ఫ్రెండ్ ఖాన్సార్ ని తానే కూలగొట్టేస్తాడు అని అంటున్నారు. మరి ఇది ఎందుకు ఎలా చేస్తాడు. ప్రాణ స్నేహితుడికే ఎదురు తిరగడం ఏంటి అనేది సినిమాలో చూడాలని బాలీవుడ్ మీడియా అంటున్నారు.

దీనితో సలార్ లో ఓ స్ట్రాంగ్ పాయింట్ తోనే రాబోతుంది అని చెప్పాలి. మరి ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రేయ రెడ్డి బాబీ సింహ, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఈ డిసెంబర్ 22 న గ్రాండ్ గా ఇండియాస్ బిగ్గెస్ట్ రిలీజ్ కి పాన్ ఇండియా భాషల్లో ప్లాన్ చేస్తున్నారు.