ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న బిగెస్ట్ మాస్ అండ్ పాన్ ఇండియా చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ భారీ చిత్రంలో ప్రభాస్ నటించగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ అయితే తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
కాగా ఈ చిత్రంని మేకర్స్ రెండు భాగాలుగా చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అందులో భాగంగానే సలార్ సీజ్ ఫైర్ అంటూ ఫస్ట్ పార్ట్ ని కూడా అనౌన్స్ చేసి కేజీఎఫ్ లానే ఓ బిగ్ ఫ్రాంచైజ్ గా అయితే దీనిని ప్రకటించారు. కాగా ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ విషయంలో మేకర్స్ ఓ షాకింగ్ అండ్ ఊహించని డెసిషన్ తీసుకున్నట్టుగా ఇపుడు ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది.
దీనితో అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ కేవలం సింగిల్ పార్ట్ లానే రిలీజ్ చేస్తున్నారట. మరి అందుకే ఈ ఆలస్యం కూడా అన్నట్టు తెలుస్తుంది. సలార్ చిత్రం రెండు భాగాలుగా అనుకున్నప్పటికీ రెండు భాగాల కథని సింగిల్ పార్ట్ గానే ఇప్పుడు కుదిరేసిందట. అందుకే ఈ చిత్రం కేవలం ఒక్క భాగం గానే రిలీజ్ చేస్తారని గట్టి టాక్ వినిపిస్తుంది.
అయితే ఈ సినిమాని కూడా కేజీఎఫ్ తరహాలో ఎంజాయ్ చేద్దాం అనుకున్నవారికి పెద్ద దెబ్బె అని చెప్పాలి. మరి ఈ ఊహించని అంశంపై అయితే ఓ అసలు క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది. ఇది నెక్స్ట్ పోస్టర్స్ లేదా రిలీజ్ తోనే తెలుస్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించగా కేజీఎఫ్ నిర్మాణ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.