ఇన్సైడ్ టాక్ : రామ్ బిగ్గెస్ట్ మాస్ ప్రాజెక్ట్ ముందే వచ్చేస్తుందా??

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న కొన్ని మంచి క్రేజీ కాంబినేషన్స్ లో ఉస్తాద్ రామ్ పోతినేని అలాగే దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం కూడా ఒకటి. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా అయితే రామ్ కెరీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ ప్రాజెక్ట్ గా అయితే రాబోతుంది.

మరి ఇదిలా ఉండగా ఈ సాలిడ్ సినిమా నుంచి టీజర్ కూడా రాగా దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా ఓ సాలిడ్ వార్త సినీ వర్గాల్లో ఆసక్తిగా వినిపిస్తుంది. నిజానికి ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఇపుడు అయితే ఈ విడుదల విషయంలో బిగ్ చేంజ్ రానున్నట్టుగా తెలుస్తుంది. మేకర్స్ దసరా రేస్ నుంచి ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ లు చేస్తున్నారట. దీనితో ఆల్ మోస్ట్ ఆగష్టు రిలీజ్ కి ఈ సినిమా రావడం ఖాయం అన్నట్టు తెలుస్తుంది.

అయితే ఆ నెలలో ఉన్న ఇతర పలు భారీ సినిమాల డేట్స్ రీత్యా అయితే  సినిమా రావాలా వద్దా అనేది డిసైడ్ కానున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో రీసెంట్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే పాన్ ఇండియా వైడ్ ఈ చిత్రంని శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు.