టాలీవుడ్ నుంచి గడిచిన ఈ కొన్ని రోజుల్లో కాస్త మంచి మంచి హైప్ అండ్ మిడ్ రేంజ్ లో భారీ సినిమా అన్నట్టుగా వచ్చిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కించిన భారీ చిత్రం “స్కంద” అనే చెప్పాలి.
ఎప్పటిలానే బోయపాటి మాస్ మార్క్ తో అదరగొట్టేసిన ఈ చిత్రం భారీ వసూళ్లు రామ్ కెరీర్ లో అందుకుంది. కాగా మొదటి పది రోజులు మేర బాగానే రన్ అయ్యిన ఈ చిత్రం అయితే ఫైనల్ గా నష్టాల్లోనే ముగిసినట్టుగా ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి. మరి లేటెస్ట్ గా అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి సినీ వర్గాల్లో నయా బజ్ వినిపిస్తుంది.
స్కంద చిత్రాన్ని మేకర్స్ ఈ అక్టోబర్ 27 న డిజిటల్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. కాగా ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ బోయపాటి గత చిత్రం అఖండ హక్కులు అందుకున్న హాట్ స్టార్ వారే కొనుగోలు చేయగా అందులో ఈ చిత్రం వస్తే ఈ అక్టోబర్ లోనే లేదా నవంబర్ లో దీపావళి స్పెషల్ ప్రీమియర్ గా అయితే రాబోతుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి.
మరి ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం చూస్తున్న వారు అయితే ఈ కొన్ని రోజులు ఆగితే సరిపోతుంది. కాగా ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు.