ఇన్సైడ్ టాక్ : పవన్ కొత్త సినిమా మొదలవ్వడానికి డేట్ కన్ఫర్మ్ అయ్యిపోయిందట.!

Pawan Movie

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ లాస్ట్ భారీ హిట్ చిత్రం “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. పవన్ కెరీర్ లో మొదటి 100 కోట్ల షేర్ రాబట్టిన సినిమాగా కూడా ఇది నిలిచింది.

అయితే పవన్ ఇప్పుడు తన కెరీర్ పరంగా చూసినట్టు అయితే రాజకీయాల మూలాన సినిమాలు చాలా ఆలస్యంగా మళ్ళీ స్టార్ట్ అయ్యే పరిస్థితి నెలకొంది. పైగా ఆల్రెడీ కమిట్ అయ్యిన చిత్రాలు ప్రశ్నార్ధకంగా మిగిలిపోయిన పరిస్థితి కూడా నెలకొంది.

అయితే ఈ చిత్రాల్లో లేటెస్ట్ గా ఇంకో రీమేక్ ని పవన్ స్టార్ట్ చేస్తుండడంతో మిగతా సినిమాల వారు తల పట్టుకున్నారు. అయితే ఈ సినిమాకి కేవలం 20 రోజులు మాత్రం డేట్స్ ఇవ్వడంతో పర్వాలేదు అనుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై సినీ వర్గాల్లో లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తుంది.

ఈ సినిమాని దర్శకుడు సముద్రఖని ఈ జూలై 12 నుంచి గాని 13 నుంచి గాని రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ షూటింగ్ లో సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొననున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాపై అయితే ఇంకా మరింత సమాచారం రావాల్సి ఉంది.