ఇన్సైడ్ టాక్ : “NBK108” కోసం క్రేజీ ప్లానింగ్.?

ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోలు అంతా ఆల్ మోస్ట్ మంచి హిట్ ట్రాక్ తో మళ్ళీ గాడి లో పడి మరిన్ని సూపర్ సినిమాలతో తాము సిద్ధం అవుతున్నారు. అలాగే వారిలో మాస్ గాడ్ నందమూరి నటసింహ బాలకృష్ణ కూడా ఒకరు. మరి బాలయ్య అయితే ‘అఖండ’ “వీర సింహా రెడ్డి” సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ హిట్స్ అందుకొని తన రికార్డులు తానే బ్రేక్ చేసుకున్నారు.

ఇక దీనితో నెక్స్ట్ తన కెరీర్ 108వ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాని దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తుండగా ఈ సినిమా కోసం మేకర్స్ ఇప్పుడు క్రేజీ ప్లానింగ్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో లేటెస్ట్ ట్రెండ్ లో భాగంగా ఓ సూపర్ హిట్ సాంగ్ ని ఈ సినిమా కోసం మళ్ళీ రీ క్రియేట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఆ సాంగ్ ఇంకేదో కూడా కాదట. బాలయ్య సెన్సేషనల్ హిట్ సమర సింహా రెడ్డి లో సాంగ్ అందాల ఆడ బొమ్మ ని ఈ సినిమా కోసం మళ్ళీ ప్లాన్ చేస్తున్నారట. దీనితో ఈ క్రేజీ ప్లానింగ్స్ కోసం సినీ వర్గాల్లో ఓ టాక్ ఆసక్తిగా నడుస్తుంది. మరి ఇందులో ఇంకా ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ఫిక్స్ కాగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా థమన్ ఎస్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు.