ఇండస్ట్రీ బజ్ : అసలు 29వ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్?

టాలీవుడ్ దగ్గర ఉన్నటువంటి ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇపుడు దర్శకుడు త్రివిక్రమ్ తో భారీ సినిమా “గుంటూరు కారం” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్ కూడా ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది.

అయితే ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 28వది కాగా ఈ చిత్రం తర్వాత అయితే మహేష్ బాబు తన కెరీర్ 29వ సినిమాని గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా కన్నా ముందే మహేష్ బాబు ఇంకో సినిమా చేయనున్నాడు అని పలు రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఈ చిత్రం మహేష్ కెరీర్ లో 29వ గా మారబోతుంది అని తెలుస్తుంది. అంటే మహేష్ రాజమౌళి ల చిత్రం అనేది 30వ సినిమాగా మారుతుంది అని చెప్పాలి. కాగా మహేష్ 29వ సినిమా అయితే దర్శకుడు అనీల్ రావిపూడితో అయ్యితే చేస్తున్నట్టిగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే ఇదే కాంబినేషన్ లో భారీ హిట్ చిత్రం “సరిలేరు నీకెవ్వరు” వచ్చింది.

కాగా ఈ చిత్రాన్ని నిర్మాణం వహించిన నిర్మాత అనీల్ సుంకర అయితే మళ్ళీ నిర్మాణం వహించనున్నారని రూమర్స్ ఉన్నాయి. కాగా ఇప్పటికే  దర్శకుడు అనీల్ సుంకర మహేష్ తో ఇంకో సినిమా చేస్తున్నట్టుగా కూడా చెప్పాడు. దీనితో ఇప్పుడు అది ఇక ఇలా నిజం అవుతుంది అని చెప్పాలి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ రానున్నాయి.