ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషనల్ హైప్ లో ఉన్న కొన్ని బిగ్గెస్ట్ చిత్రాల్లో అయితే పాన్ ఇండియా యంగ్ హీరో ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ చిత్రం “సలార్” కూడా ఒకటి. మరి ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం అయితే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కి మేకర్స్ వాయిదా వేశారు.
అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మరియు రాజు హిరానీ లాంటి సెన్సేషనల్ కాంబినేషన్ ఆల్రెడీ లాక్ చేసుకున్న డేట్ డిసెంబర్ 22 కి. దీనితో ఈ ఏడాదికి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఇదే బిగ్గెస్ట్ క్లాష్ గా మారగా ఇప్పుడు ఈ క్లాష్ ఓ క్రేజీ అప్డేట్ అయితే ఇపుడు తెలుస్తుంది. దీనితో ఈ ఊహించని రేస్ నుంచి షారుఖ్ నటించిన ‘డన్కి’ తప్పుకున్నట్టుగా ఇపుడు వార్తలు మొదలయ్యాయి.
కాగా ఈ చిత్రంలో అయితే ఇంకా గ్రాఫిక్స్ పనులు పెండింగ్ ఉండడంతో చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదికి మార్చుకున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ భారీ రేస్ లో ఒక్క సలార్ మాత్రమే సోలో గా రాబోతుంది అని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో పృథ్వీ రాజ్ సుకుమారన్ అలాగే జగపతిబాబు తదితరులు నటిస్తుండగా మేకర్స్ రెండు భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కించారు. అలాగే రవి బసృర్ సంగీతం అందించాడు.