ఇండస్ట్రీ టాక్ : “పుష్ప 2” విడుదల తేదీ ఖరారు..

ఇపుడు పాన్ ఇండియా సినిమా దగ్గర గట్టిగా వినిపిస్తున్న సినిమా పేరు అలాగే హీరో పేరు ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ పుష్ప 2 ది రూల్ అనే అంటున్నారు అంతా. లేటెస్ట్ గా 69 వ జాతీయ పురస్కారాల్లో అల్లు అర్జున్ కి ఉత్తమ నటునిగా అవార్డు రావడం సెన్సేషనల్ గా మారగా..

పుష్ప చిత్ర యూనిట్ అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక దీనితో పుష్ప 2 కోసం అందరిలో చర్చగా మారగా ఇదే సమయంలో పుష్ప 2 రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి అయితే బిగ్గెస్ట్ ట్రీట్ జస్ట్ ఈ రెండు మూడు రోజుల్లో రానుంది అని సినీ వర్గాలు చెప్తున్నారు.

కాగా ఈ బజ్ ప్రకారం అయితే ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చ్ 22న అయితే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి రాబోతున్నట్టుగా గట్టి రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఎట్టి పరిస్థితుల్లో పుష్ప 2 ది రూల్ మాత్రమే వచ్చే ఏడాది ఫస్టాఫ్ లోనే వచ్చేస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా..

రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ లో నటిస్తున్నట్టుగా తెలిసిందే. అలాగే పాన్ ఇండియా భాషల్లో మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ వైడ్ గా ఈసారి ఎన్ని వీలయితే అన్ని భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం డెఫినెట్ గా ఈ చిత్రం 1000 కోట్ల పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్ గా మరింత స్థాయిలోకి వెళ్తుంది.