ఇండస్ట్రీ టాక్ : పవన్ నుంచి రెండో పాన్ ఇండియా సినిమా.?

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ కూడా మారగా దాదాపు అందరు హీరోలూ ఈ సినిమాలు చేస్తున్నారు. మరి అలా మొదటగా పవన్ నుంచి అనౌన్స్ అయ్యిన భారీ పాన్ ఇండియా సినిమానే “హరిహర వీరమల్లు”.

దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు అలా నత్త నడకన నడుస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా 30 శాతానికి పైగా బాలన్స్ ఉండగా మరి పవన్ నుంచి రెండో పాన్ ఇండియా సినిమా రాబోతున్నట్టుగా ఇపుడు గట్టి టాక్ వినిపిస్తుంది.

కాగా ఈ సినిమా మరేదో కూడా కాదట. పవన్ ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్ అవుతున్న క్రేజీ కాంబో సుజీత్ తో ప్లాన్ చేసిన “ఓజి” అని తెలుస్తుంది. మరి ఈ భారీ సినిమా ని ఇప్పుడు నిర్మాణ సంస్థ పాన్ ఇండియా లెవెల్లో టైటిల్ ని రిజిస్టర్ చేయించారట. మొదట తెలుగులో చేయగా ఇప్పుడు హిందీ, తమిళ్, మలయాళ కన్నడ భాషల్లో కూడా రిజిస్టర్ చేశారట.

దీనితో అయితే పవన్ నుంచి రెండో పాన్ ఇండియా సినిమా సిద్ధం అవుతుంది అని చెప్పాలి. కాగా ఇపుడు సినిమా యూనిట్ లొకేషన్స్ హంట్ లో ఉండగా పవన్ అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ లో అడుగు పెట్టనున్నాడు అలాగే ప్రస్తుతానికి తాను లేని సన్నివేశాలు మొదట చిత్రీకరించనున్నారని సమాచారం.