ఇండస్ట్రీ టాక్ : “RC15” టైటిల్ అర్ధం ఇదే.!

ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తమ సినిమా సక్సెస్ లో భాగంగా  యూఎస్ లో ఆస్కార్ ఈవెంట్ కి గాను వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత మరో పాన్ ఇండియా క్రేజీ డైరెక్టర్ శంకర్ తో తాను సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం RC15 గా పిలవబడుతూ ఉండగా..

ఈ సినిమాకి రీసెంట్ గానే శంకర్ “సీఈఓ” అనే టైటిల్ ని పాన్ ఇండియా టైటిల్ గా అయితే ఫిక్స్ చేసిన రూమర్స్ ఉన్నాయి. కాగా ఈ సినిమా ఆల్ మోస్ట్ ఇదే టైటిల్ ని ఫిక్స్ చేసుకోగా దీనిపై ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాక్ ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇప్పుడు వినిపిస్తుంది.

మరి అసలు సీఈఓ అంటే అర్ధం “ఛీఫ్ ఎలెక్ట్రోల్ ఆఫీసర్” అట. ఇది వరకు దీనికి వేరే అర్ధాలు బయటకి వచ్చాయి కానీ ఇప్పుడు అయితే కొన్ని ట్రస్టడ్ సోర్సెస్ నుంచి ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం. మరి ఈ మార్చ్ 27న వచ్చే టైటిల్ ఇదేనా కాదా అనేది చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

అలాగే దిల్ రాజు భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మిస్తున్నారు. అలాగే అంజలి, శ్రీకాంత్ ఎస్ జె సూర్య లాంటి ఇతర బిగ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అలాగే దాదాపు ఇది శంకర్ డెసిషన్ మీదే ఆధారపడి ఉందని దిల్ రాజు కన్ఫర్మ్ చేశారు.