ఇండస్ట్రీ టాక్ : ఎన్టీఆర్ హీరోయిన్ ని పరిచయం చేసేది అప్పుడేనా.?

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ దగ్గర ఉన్న పలు మోస్ట్ అవైటింగ్ సినిమాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనౌన్స్ చేసిన తన తదుపరి సినిమాలు అన్ని కూడా ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో దర్శకుడు దర్శకుడు కొరటాల శివతో ప్లాన్ చేసిన తన బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ 30వ సినిమా మాత్రం ఎప్పుడు నుంచో ఏదొక అడ్డంకుతో వాయిదా పడుతూనే ఉంది.

ఇంకా ముహూర్త కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసుకోని ఈ సినిమా ఇతర అంశాలకి సంబంధించి కూడా సస్పెన్స్ గానే కొనసాగుతుంది. కాగా ఈ సినిమాలో అయితే హీరోయిన్ గా బాలీవుడ్ యంగ్ అండ్ హాట్ బ్యూటీ ఫైనల్ అయ్యినట్టుగా సినీ వర్గాలు కన్ఫర్మ్ చేశారు. రీసెంట్ గానే ఈమెకి లుక్ టెస్ట్ కూడా ఫినిష్ చేసి మేకర్స్ మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నారు.

కాగా ఇప్పుడు ఈమె విషయంలో కూడా అనౌన్స్ మెంట్ ని గ్రాండ్ గానే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. టాలీవుడ్ కి ఆమెని పరిచయం చేస్తూ నెక్స్ట్ లెవెల్లో ఆమెపై అనౌన్సమెంట్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. మరి దీనికి గాను ఈ మార్చ్ మొదటి రెండు వారాల్లో షెడ్యూల్ చేసినట్టుగా తెలుస్తుంది.

అయితే మొదటి వారం లేకపోతే రెండో వారం లో ఈ అనౌన్సమెంట్ ని అందించనున్నారని రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమౌతుందో వేచి చూడాలి. కాగా ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.