ఇండస్ట్రీ టాక్ : ఎన్టీఆర్ సినిమా అప్పటికి వాయిదా??

తెలుగు సినిమా నుంచి ఈ ఏడాదిలో మాత్రం చాలా పెద్ద సినిమాలే వస్తున్నాయి అని చెప్పాలి. ఆల్రెడీ చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ పెద్ద హిట్ కాగా హిందీ మార్కెట్ లో కూడా ఇది బాగానే వసూళ్లు రాబడుతుంది. ఇక నెక్స్ట్ తెలుగు సినిమా నుంచి వస్తున్నా పాన్ ఇండియా సినిమా అది కూడా బిగ్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది “దేవర”.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో చేస్తున్న రెండో సినిమా ఇది కాగా భలే హైప్ ఉంది దీని పైన. ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ ని లేట్ గా స్టార్ట్ చేసినప్పటికీ పలు పాన్ ఇండియా సినిమాల కంటే ముందే కొరటాల ఫినిష్ చేస్తున్నాడు అందుకే రిలీజ్ డేట్ కూడా ఎప్పుడో ఫిక్స్ చేశారు.

కాగా ఇప్పుడుకి కూడా అదే డేట్ కి ఫిక్స్ అయ్యి ఉన్నారు కానీ చిత్రం రిలీజ్ వాయిదా పడుతుంది అని మళ్ళీ ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. మెయిన్ గా ఏపీలో ఎన్నికలు ఎప్పుడు అనేది దేవర యూనిట్ ని టెన్షన్ పెడుతుండగా ఒకవేళ ఏప్రిల్ లోనే అయితే సినిమా రిలీజ్ ని మేకర్స్ వాయిదా వేసినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

దీని ప్రకారం ఈ ఏడాది జూన్ లో సినిమాని విడుదల చేసేలా చేసుకోవాలని చూస్తున్నట్టుగా సినీ వర్గాల్లో ఓ టాక్ వైరల్ గా మారింది. మరి చూడాలి ఫైనల్ గా దేవర రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అనేది. ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉత్సాహంతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.