ఇండస్ట్రీ టాక్ : “సలార్” కి పెద్దగా ఇబ్బంది లేనట్టేనా?

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ ప్రాజెక్ట్ లలో ఈ డిసెంబర్ ఎండింగ్ లో రాబోతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “సలార్” కూడా ఒకటి. ప్రభాస్ హీరోగా దర్శకుడు కేజీఎఫ్ చిత్రాలు ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా ఎనలేని హైప్ దీనిపై నెలకొంది.

అయితే మన తెలుగు వరకు ఒకే హిందీలో కూడా అంచనాలు బాగానే ఉన్నాయి కానీ అక్కడ హిందీ నుంచి ఇదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం “డంకి” కూడా రేస్ లో ఉంది. అయితే ఆల్రెడీ షారుఖ్ ఖాన్ రెండు బిగ్గెస్ట్ హిట్స్ ఈ ఏడాదిలో కొట్టాడు.

ఇంకోపక్క దర్శకుడు రాజ్ కుమార్ ఇరానీతో సినిమా కావడంతో హిందీ మార్కెట్ లో చాలా ఇంపాక్ట్ ఈ సినిమా కలిగిస్తుంది అని చాలా మంది నమ్ముతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ చూసాక మరీ అంత భారీ హైప్ అయితే దీనికి వచ్చేయలేదు అని చెప్పాలి.

చాలా రెగ్యులర్ గానే ట్రైలర్ అనిపించడంతో సలార్ పై అంత ప్రభావం అయితే చూపించదు అనే చెప్పొచ్చు. పైగా సలార్ ఒక మాస్ సబ్జెక్టు కావడం దీనికి బాగా ప్లస్ అయ్యింది. మరి రిలీజ్ అయ్యాక షారుఖ్ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చి సలార్ కి కూడా పాజిటివ్ వస్తే డంకి కి కష్టమే అని చెప్పొచ్చు. మరి ఏది తేలాలి అంటే ఈ డిసెంబర్ 21, 22 తేదీలకి ఆగితే సరిపోతుంది.