ఇండస్ట్రీ టాక్ : దసరాకి “గేమ్ చేంజర్” నుంచి క్రేజీ ట్రీట్..!

టాలీవుడ్ గ్లోబల్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న మాసివ్ పాన్ ఇండియా చిత్రం “గేమ్ చేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా అలా షూటింగ్ కొనసాగుతూనే వస్తుండగా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి.

కాగా గత కొన్ని రోజులు కితం సినిమా నుంచి ఊహించని విధంగా లీక్ అయ్యి అందరికీ షాకిచ్చింది. దీనితో మేకర్స్ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ అందరికీ ఇవ్వగా ఇక నెక్స్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసినట్టుగా శంకర్ కూడా అప్డేట్ అందించారు. అయితే వీటితో పాటుగా ఫ్యాన్స్ కి ఐయే ఇపుడు ఇంకో ఎగ్జైటింగ్ బజ్ సినీ వర్గాల నుంచి వినిపిస్తుంది.

దీనితో అయితే దసరా కానుకగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఎలాగో సాంగ్ లీక్ అయ్యింది కాబట్టి ఇక లేట్ చేయకుండా ఉండాలని ఈ సాంగ్ ని దసరా కానుకగా విడుదల చేసేయాలని చూస్తున్నారట. కాగా ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందించగా తాను కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్ లీక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరి ఫైనల్ గా అయితే ఫస్ట్ సాంగ్ వస్తుంది. శంకర్ మార్క్ తో విజువల్స్ కూడా మ్యాచ్ అయితే థియేటర్స్ పగిలిపోతాయి అని చెప్పొచ్చు. అలాగే చాలా మంది మళ్ళీ రామ్ చరణ్ కియారా అద్వానీల కెమిస్ట్రీ కోసం కూడా ఎదురు చూస్తున్నారు.