ఇండస్ట్రీ టాక్ : అతడితో చరణ్ సినిమా ఆల్ మోస్ట్ ఫిక్స్ అట.!

ram-charan

ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ ని దర్శకుడు రాజమౌళితో నటించిన చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) దీని తర్వాత ఈ ఏడాదిలోనే ఆచార్య సినిమా చేసి భారీ డిజాస్టర్ కూడా మూటగట్టుకున్నాడు. ఇక దీని తర్వాత దర్శకుడు శంకర్ తో చరణ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ని చేస్తున్నాడు.

మరి ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తి కాగా ఇప్పుడు విశాఖ పరిసరాల్లో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ దర్శకుడు గౌతమ్ తిన్ననురితో ప్లాన్ చేయాల్సి ఉంది కానీ ఫైనల్ నరేషన్ లో గౌతమ్ తనని మెప్పించలేదు దీనితో చరణ్ ఫైనల్ గా నో చెప్పాల్సి వచ్చింది.

కానీ నెక్స్ట్ మరింతమంది స్టార్ దర్శకులు తన లైన్ లో ఉండగా ఇప్పుడు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి చరణ్ 16వ సినిమాని మాత్రం కన్నడ దర్శకుడు నర్తన్ తోనే చేయనున్నట్టుగా తెలుస్తుంది. దర్శకుడు చరణ్ ని మెప్పించగా యూవీ క్రియేషన్స్ వారు ఈ కొత్త కాంబినేషన్ ని లాక్ చేసేసినట్టే అని తెలుస్తుంది.

అలాగే ఓ డేట్ చూసుకొని అయితే మేకర్స్ ఈ మాసివ్ కాంబినేషన్ ని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి ఇది ఎప్పుడు వస్తుంది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ దర్శకుడు అయితే కన్నడ లో మఫ్టీ అనే సినిమా చేసి సెన్సేషనల్ హిట్ కొట్టగా దీనినే వీరసింహా రెడ్డి సినిమాగా రీమేక్ చేస్తున్నారని బాలయ్యపై కొన్ని రూమర్స్ ఉన్నాయి.