ఇండస్ట్రీ బజ్ : “గేమ్ చేంజర్” రిలీజ్ ఈ ఏడాది లోనే.?

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ చిత్రం “గేమ్ చేంజర్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మాసివ్ ప్రాజెక్ట్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటూ ఉండగా ఈ అవైటెడ్ సినిమా భారీ క్లైమాక్స్ ని కూడా మేకర్స్ నిన్ననే కంప్లీట్ చేసారు.

ఇక ఈ సినిమా రిలీజ్ కి గాను ఎప్పుడు నుంచో అలా సస్పెన్స్ నడుస్తూనే ఉంది. కాగా దిల్ రాజు అయితే దాదాపుగా ఈవచ్చే సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని గ్రాండ్ ప్లాన్స్ చేస్తున్నట్టుగా తెలిపారు. కానీ ఫైనల్ గా మాత్రం సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది శంకర్ గారి చేతిలోనే ఉందని తెలిపారు.

అలాగే బహుశా ఈ ఏడాదిలో కూడా రిలీజ్ ఉండొచ్చని ఇది వరకు టాక్ ఉంది. ఇక ఇపుడు దీని ప్రకారం సెన్సేషనల్ టాక్ ఇపుడు వైరల్ గా మారింది. మేకర్స్ ఈ ఏడాది లోనే రిలీజ్ చేసే ప్లాన్స్ చేస్తున్నారట. దాదాపు డిసెంబర్ బరిలో ఈ సినిమా ఉంటుంది అని అలాగే ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా కాస్త ముందే రిలీజ్ చేసినా మంచి వీకెండ్ ఉంది కాబట్టి ఈ సమయం బాగా ప్లస్ అవుతుంది అని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు.

మరి ఈ చిత్రం అయితే ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతుందా లేదా అని ఇంకొన్నాళ్ళు ఆగితే తేలిపోతుంది. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా నిర్మాత దిల్ రాజు తమ బ్యానర్ లో 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఖర్చుకి వెనకాడకుండా నిర్మాణం వహించారు.