ఇండస్ట్రీ బజ్ : “భగవంత్ కేసరి” కూడా అలాంటి చిత్రమేనా?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ బజ్ తో రిలీజ్ కి రాబోతున్న పెద్ద చిత్రాల్లో అయితే టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి కూడా ఒకటి. కాగా టాలీవుడ్ వరుస హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.

కాగా ఇపుడు ఫైనల్ స్టేజ్ లోకి వచ్చేసింది. దీనితో సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ కూడా నెలకొనగా ఇపుడు ఓ ఎగ్జైటింగ్ టాక్ అయితే ఈ సినిమాపై సినీ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఈ సినిమా అట రీసెంట్ గా సౌత్ లో స్టార్ట్ అయ్యిన తమిళ సినిమా ట్రెండ్ విక్రమ్, జైలర్ తరహాలో ఉంటుంది అని అంటున్నారు.

ఆ సినిమాల్లో ఎలాగైతే హీరో పాత్ర ఓల్డేజ్ లో ఉంటుందో పాటలు హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ తక్కువ లాంటి కోణాలు ఉంటాయో అదే విధంగా బాలయ్య భగవంత్ కేసరి కూడా ఉంటుంది అని సినీ వర్గాలు చెప్తున్నాయి. హీరోయిన్ గా కాజల్ ఉన్నప్పటికీ కథా పరంగా ఉండొచ్చు అని అలాగే సినిమాలో పాటలు కూడా తక్కువే ఉంటాయి అని ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.

దీనితో భగవంత్ కేసరి కూడా ఇదే ఫార్మాట్ లో వచ్చి అదరగొడుతుంది అని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. దీనితో ఈ చిత్రం వాటిలానే పెద్ద హిట్ అవుతుందో లేదో ఆగి చూడాలి. కాగా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.