ఇండస్ట్రీ టాక్ : “ఇండియన్ 2” రిలీజ్ ఆల్మోస్ట్ ఈ బరిలోనే.!

తమిళ సినిమా స్టార్ దర్శకుడు శంకర్ తన కెరీర్ లో చేసిన ఎన్నో చిత్రాల్లో ఉలగనయగన్ కమల్ హాసన్ తో చేసిన భారీ చిత్రం “ఇండియన్” కూడా ఒకటి. అప్పట్లోనే 50 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టగా తెలుగులో “భారతీయుడు” గా రిలీజ్ చేశారు. మరి దీనికి సీక్వెల్ సినిమా అయితే ఇపుడు ఫైనల్ గా సిద్ధం చేస్తుండగా ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు అనేక దేశాల్లో అయితే శరవేగంగా కంప్లీట్ అవుతుంది.

అయితే శంకర్ ఇప్పుడు కమల్ హాసన్ తో పాటుగా రామ్ చరణ్ తో ఇంకో సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ రెండు సినిమాలు రిలీజ్ లు ఎప్పుడు ఉంటాయి అనేది మాత్రం ఒక సినిమా మీద ఇంకో సినిమా డిపెండ్ అయ్యినట్టుగా టాక్ వచ్చింది.

కాగా వీటిలో ఇప్పుడు ఇండియన్ 2 ని అయితే దాదాపు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయడానికి సిద్ధం చేసినట్టుగా కన్ఫర్మ్ అన్నట్టుగా తెలుస్తుంది. సినీ వర్గాల లేటెస్ట్ స్ట్రాంగ్ సమాచారం ప్రకారం అయితే ఇండియన్ 2 అప్పుడు రావడం ఖాయం అట. మరి రామ్ చరణ్ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.

కాగా ఈ చిత్రంలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ లు నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సీక్వెల్ ని నిర్మాణం వహిస్తున్నారు. కమల్ రీసెంట్ గానే “విక్రమ్” తో భారీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.