ఏంటి శంకర్ లేకుండానే “ఇండియన్ 2” పూర్తి??

ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని హాలీవుడ్ లెవెల్లో ఇప్పుడు చూస్తున్నాం కానీ దాదాపు పదమూడేళ్ళ కితమే ఇది ఇండియన్ సినిమా అంటూ చూపించిన ఏకైక దర్శకుడు శంకర్. తన విజనరీ డైరెక్షన్ తో సమాజంలో ఏదొక మార్పు తీసుకురావాలని చూసే శంకర్ సినిమాలకి పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ ఉంది.

కాగా శంకర్ ఇప్పుడు బాడ్ టైం లో ఉన్నారు. దీనితో తాను కం బ్యాక్ ఇస్తే చూడాలని చాలా మంది చూస్తున్నారు. ఇక ఇపుడు శంకర్ రెండు చిత్రాలు చేస్తుండగా వాటిలో ఉలగనయగన్ కమల్ హాసన్ తో చేస్తున్న సినిమా “ఇండియన్ 2” కూడా ఒకటి. కాగా ఈ సినిమాని శంకర్ తమ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ కి సీక్వెల్ గా మళ్ళీ 25 ఏళ్ల తర్వాత చేస్తున్నాడు.

దీనితో దీనిపై ఆ బజ్ ఉంది. కానీ ఈ సినిమా కొన్ని చిక్కులు మధ్య షూట్ ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇక ఈ చిత్రం షూట్ ని శంకర్ రీస్టార్ట్ చేసాక ఎప్పటికపుడు అప్డేట్స్ ఇస్తూ ఉండేవారు కానీ తాజాగా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్టుగా తమిళ సినీ వర్గాలు తెలిపాయి.

దీనితో కమల్ సహా చిత్ర యూనిట్ అంతా ఎండ్ షూట్ పిక్ లో కనిపించారు. కానీ ఈ పిక్ లో ఎక్కడా కూడా అసలు దర్శకుడు శంకర్ కనిపించలేదు. దీనితో శంకర్ లేకుండానే ఇండియన్ 2 కంప్లీట్ చేసారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. కమల్ కి కూడా దర్శకత్వంలో అనుభవం ఉంది.

మరి లాస్ట్ పార్ట్ లో అయితే తాను గాని చేసారా అని కొంతమంది అంటున్నారు. కానీ శంకర్ మిస్ అవ్వడం అనేది ఇప్పుడు అందరిలో ప్రశ్నగా మారింది. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.