అందరికన్నా ముందే “ఆనిమల్” ని చూడనున్న ఇండియాస్ టాప్ డైరెక్టర్ 

ఈ ఏడాది సెన్సేషనల్ కం బ్యాక్ అందుకున్నాక బాలీవుడ్ సినిమా నుంచి మరిన్ని భారీ హిట్స్ అయితే ఇప్పుడు వస్తున్నాయి. మరి ఈ చిత్రాల్లో లేటెస్ట్ గా వస్తున్నా అవైటెడ్ చిత్రాల్లో ఒకటి “ఆనిమల్” కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించాడు.

మరి హిందీ సహా తెలుగులో కూడా మంచి హైప్ నమోదు చేసుకున్న ఈ చిత్రం నిన్నే హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయగా ఈ ఈవెంట్ కి జక్కన్న రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్టులుగా హాజరు కాగా ఈ చిత్రం ఈవెంట్ లో అయితే రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.

తాను ఈ సినిమా టీజర్ చూసినప్పుడే ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫిక్స్ అయ్యిపోయాను అని కాకపోతే తనకి డిసెంబర్ 1న మరో పని పడడంతో తాను నవంబర్ 30 నే చూసేస్తున్నట్టుగా తెలిపాడు. మరి అందుకు అందరికీ సారీ చెప్పి మీ అందరికన్నా సినిమా ముందే చూసేసి నేను బయటి వెళ్ళిపోతున్నాను అని..

మీరంతా డిసెంబర్ 1న రిలీజ్ కి చూసి ఎంజాయ్ చేయండి అని జక్కన్న తెలిపాడు. మరి సినిమా చూసి రాజమౌళి తన ఫస్ట్ రివ్యూ ఏమన్నా అందిస్తారో లేదో చూడాలి. కాగా ఈ భారీ చిత్రం పాన్ ఇండియా భాషల్లో అయితే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా వసూళ్లు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు.