లాయర్ గా సరికొత్త పాత్రలో విశ్వక్ ..అంచనాలు అందుకోవటానికి చాలా వంగాల్సి వంచిందంటూ?

యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫలక్నామ దాస్ సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విశ్వక్ సేన్ ఆ సినిమా ద్వారా మంచి హిట్ అందుకని ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత విశ్వక్ నటించిన పాగల్ అశోకవనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాల్లో కూడా మంచి హిట్ అయి కుటుంబ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్నాడు. ఇలా హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విశ్వక్ తాజాగా ఓరి దేవుడా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన విడుదలైన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని మంచి హిట్ అందుకుంది. ఇక తాజాగా విశ్వక్సేయ్ నటించిన మరొక సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అన్ని సినిమాలలో హీరోగా నటించిన విశ్వక్ “ముఖచిత్రం” అనే సినిమాలో కీలక పాత్రలో నటించాడు. సందీప్ రాజ్ ‘ముఖచిత్రం’ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ సినిమా ద్వారా గంగాధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో విశ్వామిత్ర అనే ఒక పవర్ఫుల్ లాయర్ పాత్రలో విశ్వక్ నటించాడు.

తాజాగా ఈ సినిమాకి సంబందించిన టీజర్ ఇటీవల విడుదల అయ్యింది. ఈ టీజర్ లో విశ్వక్ చెప్పిన ఓకే ఒక డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ని పవర్ ఫుల్ లాయర్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అందరినీ తన వాదనలతో ఏడిపించే ఒక సీనియర్ లాయర్ నే ఎదుర్కొని నిలబడే యంగ్ లాయర్ క్యారెక్టర్ లో విశ్వక్ సేన్ కనిపించనున్నారు.ఈ సినిమాలో విశ్వక్ పాత్ర 15 నుంచి 20 నిమిషాల వరకు ఉంటుందని సమాచారం. ఇందులో విశ్వక్ సేన్ చెప్పిన డైలాగులు వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ టీజర్ ఆడియన్స్ ను ఆకట్టుకుని సినిమా మీద అంచనాలు పెంచింది.