Big Boss 6: బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లనున్న తెలంగాణ పేదల లాయర్..?

Big Boss 6: బుల్లితెర మీద ప్రసారమై మంచి ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో లలో బిగ్ బాస్ రియాల్టీ షో కూడా ఒకటి. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ వంటి భాషలలో ప్రసారమవుతున్న ఈ షో తెలుగులో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే బుల్లితెర మీద ఐదు సీజన్లు, ఓటిటిలో ఒక నాన్ స్టాప్ సీజన్ పూర్తి చేసుకుంది. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో బిందు మాధవి టైటిల్ దక్కించుకొని కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త హల్చల్ చేస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 6 కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ సీజన్ 6 లో పాల్గొనే కంటెస్టెంట్ ల ఫైనల్ లిస్ట్ మాత్రం బయటకి రాలేదు. ఈ సీజన్ 6 లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. అందువల్ల ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఎవరు పాల్గొంటున్నారా అంటూ ప్రేక్షకులు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లలో ఒక వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. ఈ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ 6 లో పాల్గొనే ఆ ఆసక్తికరమైన వ్యక్తి గురించి తెలుసుకుందాం.

బిగ్ బాస్ సీజన్ 6 లో కొందరు సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ లో ఎప్పుడు లేని విధంగా ఒక యంగ్ లాయర్ బిగ్ బాస్ షో లో పాల్గొంటున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ సుబ్బు సింగ్ పోగు బిగ్‌బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా పాల్గొంటున్నాడు అంటూ సమాచారం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుబ్బు సింగ్ కి పేదల లాయర్ అని పేరు. పేదల తరుపున వాదించి ఎంతోమందికి న్యాయం సహాయం చేయటం వల్ల ఇతనికి ఆ పేరు వచ్చింది. సుబ్బు సింగ్‌ వృత్తి పరంగా ఒక లాయర్ అయినా కూడా ఇతనికి నాటకరంగంలో చాలా అనుభవం ఉంది.అంతేకాకుండా ఆయన కొన్ని సినిమాలలో కూడా నటించారు. ఈ క్రమంలోనే సుబ్బు సింగ్‌కు బిగ్‌బాస్ నిర్వాహకుల నుంచి పిలుపు వచ్చినట్టు సమాచారం.