న్యాయమూర్తుల తరపున న్యాయవాది అవతారం ఎత్తిన రాధాకృష్ణ

Radhakrishna is a lawyer on behalf of the judges
 

ప్రజలందరూ అభిమానించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అంటే రాధాకృష్ణకు మహాద్వేషం.   చంద్రబాబు కుట్రలకు జగన్ బలైపోతాడని, చంద్రబాబు బతికున్నంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడని, ఆయన తరువాత ఉత్తరకుమారుడు లోకేష్ నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని, జీవితాంతం తమ సామాజికవర్గం వారే అధికారంలో ఉంటారని, అమరావతి పేరుతో లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టాలనే కుతంత్రానికి జగన్మోహన్ రెడ్డి రాగానే అడ్డుకట్ట పడిపోయి, ఆదాయం మొత్తం కోల్పోవడంతో మతి చాలించిన రాధాకృష్ణ కల్లుతాగిన కోతిలా తన బాధను కొత్తపలుకు పేరుతో వెళ్లబోసుకోవడం చూస్తుంటే వారి అసహనం  ఏమేరకు పెరిగిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.  ఈవారం కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డిలను కలిపేసి ఇద్దరిమీదా తన అక్కసును వెళ్లగక్కడమే కాక, జస్టిస్ రాకేష్ కుమార్ ను కూడా తన చెత్తలోకి తీసుకొచ్చి ఆయన తరపున వకాల్తా పుచ్చుకున్న ప్లీడర్ లా ఆకాశానికెత్తేశారు! 

Radhakrishna is a lawyer on behalf of the judges

Radhakrishna is a lawyer on behalf of the judges

 
 “””ఇప్పుడు బీజేపీపై యుద్ధం చేస్తాననీ, ప్రాంతీయ పార్టీలన్నింటినీ సమీకరిస్తాననీ చెబుతూ ఉండటం తెలివైన చర్యగా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు  నాయుడికి ఏమైందో మరిచిపోతే ఎలా? ఏడాదిన్నర క్రితం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా ఇలాగే బీజేపీపై తొడ కొట్టారు. ప్రధాని నరేంద్ర మోదీని దూషించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌ గాంధీ ఇంటికెళ్లి మరీ చేతులు కలిపారు. దేశమంతా కాలికి బలపం కట్టుకుని మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌, స్టాలిన్‌, కేజ్రీవాల్‌, కుమారస్వామి వంటి ప్రాంతీయ పార్టీల నాయకులతో విడిగా సమావేశమయ్యారు. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఉమ్మడి వేదికలు పంచుకున్నారు. దీంతో బీజేపీ ఆయనపై కక్ష పెంచుకుంది. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి తన వంతు పాత్ర పోషించింది.””””
 
బీజేపీపై యుద్ధం చేస్తామనడం తెలివైన చర్య కాకపోవడం అలా ఉంచితే, రాజకీయంగా ఉద్యమాలు చెయ్యడం, పార్టీలను స్థాపించడం, కూటములు కట్టడడం సర్వసాధారణం.  కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ దేశం మొత్తం పర్యటించి కాంగ్రెస్ వ్యతిరేక కూటమిని నిర్మించారు.  నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయ్యారు.  ఆయన పోరాటఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ అధికారంలోకి వచ్చారు.  ఆ తరువాత అంత గొప్ప జాతీయ కాంగ్రెస్ కూడా కూటమి కట్టింది.  అప్పటినుంచి పాతికేళ్ళపాటు సువిశాల భారతదేశాన్ని పాలించింది ఎన్డీయే, యూపీఏ కూటములు కాదా?  అంతెందుకు?  కేంద్రంలో ఇప్పుడు ఉన్నది కూడా ఒక కలగూరగంప ప్రభుత్వమే.  
 
ఇక చంద్రబాబు ఏనాడూ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించిన దాఖలా లేదు.  ఆయనకు ఒక సిద్ధాంతం లేదు. నైతికవిలువలు లేవు.  ఆయనను ఎవ్వరూ అభిమానించరు.  వెన్నుపోటు రాజకీయాల్లో సిద్ధహస్తుడు.  అత్యంత అవినీతిపరుడైన రాజకీయనాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉంటె ఆయన చంద్రబాబు మాత్రమే.  చంద్రబాబు లాంటి పచ్చి  అవకాశవాది ప్రపంచంలో మరొకరు ఉండరు.  ఆయనకు ఏమాత్రం విశ్వసనీయత లేదు.  అందుకే ఆయన మోడీకి వ్యతిరేకంగా చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలం అయ్యాయి.  ఆయన్ను నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ కూడా పరువుపోగొట్టుకుంది.  కేసీఆర్ తో ఆయనకు పోలిక ఏమిటి!  
 
 
 
“””ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా సంపన్న వర్గాలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలనే చేపట్టారు. ఈ కారణంగా 2004లో జరిగిన ఎన్నికలలో ఆయన నమ్ముకున్న ప్రాంతాల ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించలేదు. “””
 
అహహహ….ఏమి చెప్పాడు రాధాకృష్ణ!  చచ్చేముందు హంతకుడు కూడా నిజమే పలికినట్లు చంద్రబాబు ఘోరంగా ఓడిపోయి ఇక లేచే అవకాశం లేదని అర్ధమైనట్లుంది రాధాకృష్ణకు….చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సంపన్నులకు మాత్రమే ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని వాస్తవాన్ని కక్కేశారు.  చంద్రబాబు జీవితం మొత్తం పేదలను అసహ్యించుకుంటూ సంపన్నవర్గాల వారి బూట్లు నాకుతూ నికృష్టపు బతుకు బతుకుతున్నాడని దేశమంతా ఏనాడో తెలుసు కదా!  
 
 
“”””ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వద్దాం. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ శుక్రవారం రాష్ట్రప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత రాజధానిని తరలించాలనుకోవడం మతిలేని చర్య కాదా? అమరావతిలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్నదని, క్రిమినల్స్‌ రాజకీయాల్లోకి రాకుండా నిరోధించే చట్టం ఉండాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇవన్నీ తన వ్యక్తిగత వ్యాఖ్యలు అని ఆయన అన్నారు””””
 
జస్టిస్ రాకేష్ కుమార్ చాలా నీతిమంతుడే కావచ్చు.  కానీ, ఆయన తన అధికారపరిధికి మించి వ్యవహరించి తన ముందు వాదించే ప్రభుత్వ లాయర్ తో నీతులు చెప్పించుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకుని నవ్వులపాలయ్యారు.  వేలకోట్లు ఖర్చు చెయ్యాలో, వందలకోట్లు చెయ్యాలో అది ప్రభుత్వ అధికారపరిధిలోని అంశం.  దానిమీద వ్యాఖ్యానించే హక్కు జస్టిస్ రాకేష్ కుమార్ కు లేనేలేదు.  ఆయన తనముందున్న కేసు విచారణకు పరిమితం కావాలి తప్ప ప్రజలెన్నుకున్న ప్రభుత్వం మీద అనుచిత వ్యాఖ్యలు, అసందర్భ వ్యాఖ్యలు చెయ్యడం ఏమిటి?  ఎవరి మెప్పు కోసం?  తన వ్యక్తిగత వ్యాఖ్యలు వినిపించాలని కుతూహలం ఉంటే వాటిని ఎక్కడైనా బయట ఏదైనా సమావేశంలోనే, మిత్రుల సమక్షంలో కాఫీ తాగుతూనో వ్యక్తీకరించాలి.  అంతే తప్ప ధర్మాసనం మీద కూర్చుని వ్యాఖ్యానించడం సబబేనా?  స్వీయనియంత్రణ కోల్పోతే ఎలా? 
 
 
“”””విచారణకు వచ్చిన కేసుతో సంబంధం లేకపోయినా, జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం సమర్థనీయమా? కాదా? అన్న విషయం పక్కనపెట్టి ఆయన అలా వ్యాఖ్యానించడం వెనుక ఉన్న నేపథ్యం చూద్దాం. డిసెంబర్‌ 31వ తేదీన జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ పదవీ విరమణ చేస్తున్నారు. రెండు మూడు నెలల్లో పదవీ విరమణ చేసే న్యాయమూర్తులు అంత క్రియశీలకంగా ఉండరు. జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ మనస్తత్వం విభిన్నమైంది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, అధికారుల ప్రవర్తన పట్ల ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తూనే ఉన్నారు.””””
 
 
జస్టిస్ రాకేష్ కుమార్ వ్యాఖ్యలు సమర్ధనీయమా కావా అనే విషయం పక్కకు పెట్టాలట…ఎందుకు పెట్టాలి?  అత్యున్నత బాధ్యతాయుత పదవిలో ఉన్న న్యాయమూర్తి వ్యాఖ్యలు ఎందుకు పక్కన పెట్టాలి.  ఈ రాష్ట్రంతో, ఈ రాష్ట్ర పరిస్థితులతో, ప్రజలతో, రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి, అవగాహన లేని వ్యక్తి ప్రజాప్రభుత్వ చర్యలపట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే ఎలా వదిలెయ్యాలి?  ఇది తప్పు అని చెప్పడం తప్పు అవుతుందా?  ముఖ్యమంత్రి, ప్రభుత్వం కోసం అహర్నిశలు పనిచేసే అధికారుల పట్ల వ్యతిరేక వ్యాఖ్యలు చెయ్యడం సమంజసమేనా?  దేశంలోని ఏ రాష్ట్రం లోని హైకోర్టు అయినా ఇలా హద్దులు మీరు వ్యాఖ్యలు చేయడం చూస్తున్నామా?  ప్రతిపక్షాలకు మద్దతుగా ఒక ఉన్నత న్యాయమూర్తి వ్యాఖ్యలు చెయ్యడం అంగీకారయోగ్యమేనా?  
 
 
“””జగన్‌ ప్రభుత్వం ద్వేషించే ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు ఆయన. “””
 
రాధాకృష్ణలోని కులగజ్జి మరోసారి బయటకు వచ్చింది.  ఆ సామజిక వర్గాన్ని ద్వేషిస్తున్నామని జగన్ ఎప్పుడైనా చెప్పారా?  కొడాలి నాని, నందమూరి లక్ష్మీపార్వతి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వీరంతా ఏ సామాజిక వర్గం వారు?  ఇప్పుడు వైసిపికి బహిరంగమద్దతు ప్రకటించిన వల్లభనేని వంశీ, కరణం బలరామ కృష్ణమూర్తి ఏ సామాజికవర్గం?  చంద్రబాబు జీవితాంతం కొన్ని సామాజికవర్గాలను ద్వేషిస్తూనే ఉన్నారు.  ముఖ్యంగా బ్రాహ్మణులు అంటే ఆయనకు విపరీతమైన ద్వేషభావం!  కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్ని కులాలను, మతాలను సమానంగా ఆదరిస్తున్న ముఖ్యమంత్రి అని రాష్ట్రం మొత్తం చెప్పుకున్న విషయం రాధాకృష్ణ చెవుల్లో మొలిచిన చెట్లు వినపడనీయడం లేదు! 
 
 
 
“”””అమరావతికి వచ్చే ముందు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎలాంటివారో తెలుసుకునే ప్రయత్నం చేయగా, ప్రజలు చైతన్యవంతులని చెప్పారట. అమరావతికి వచ్చిన తర్వాత ఇదేమిటి? రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా అమలుకాకపోయినా ప్రజలు ఇంత స్తబ్ధుగా ఎందుకు ఉంటున్నారని ఆయన సహచరుల వద్ద విస్మయం వ్యక్తంచేశారట. మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేస్తున్నందున జగన్‌ ప్రభుత్వాన్ని అకారణంగా తప్పుపడితే జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌కు కలిగే ప్రయోజనం ఏమీ లేదు. నీలి బ్యాచ్‌ నిందిస్తున్నట్లుగా ఆయనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సంబంధాలు లేవు. ఆయన పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదు.””””
 
ఓహో!  భళిభళి!  ఒక న్యాయమూర్తి ఏదైనా రాష్ట్రానికి ఉద్యోగరీత్యా వెళ్తుంటే అక్కడి ప్రజలు ఎలాంటివారని సర్వే చేస్తారు కాబోలు!  అక్కడి ప్రజలు మంచివారు కాదంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లోనే కూర్చుంటారేమో?  రాష్ట్రంలో రూల్ అఫ్ లా అమలు కావడంలేదని ఒక్క జస్టిస్ రాకేష్ కుమార్ కు మాత్రమే గోచరించడం మహా విచిత్రమే.  మరి ఆయన స్వరాష్ట్రం బీహార్ లో రూల్ అఫ్ లా అమలు అవుతున్నదా?  జగన్ ప్రభుత్వాన్ని అకారణంగా తప్పు పడితే జస్టిస్ కు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని రాధాకృష్ణకు ఎవరు చెప్పారో?  ఆయనకు సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తులతో సంబంధాలు లేవని మరొక బాంబ్ పేల్చారు రాధాకృష్ణ.  అంటే జస్టిస్ రమణతో జస్టిస్ రాకేష్ కుమార్ కు చీకటి సంబంధాలు లేవని రాధాకృష్ణ సర్టిఫికెట్ ఇస్తున్నాడు!  ఆయనకు అలాంటి సంబంధాలు ఉన్నాయని ఎవరు చెప్పారు?  జస్టిస్ కు మద్దతుగా రాధాకృష్ణ అంత ఉత్సాహం చూపించడానికి కారణాలు ఏమిటబ్బా?  
 
 
 
“”””పదవీ విరమణ తర్వాత బిహార్‌ వెళ్లిపోతారు. అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డిపై రాగద్వేషాలు ఉండే అవకాశం లేదు. ”బిహార్‌లో కనీసం అధికారులైనా చట్టానికి లోబడి పనిచేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు అది కూడా చేయడం లేదు” అని ఒక సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారట””””
 
పదవీ విరమణ తరువాత ఆయన బీహార్ వెళ్ళిపోతారని రాధాకృష్ణకు ఎలా తెలుసు?  జస్టిస్ రాకేష్ కుమార్ రాధాకృష్ణతో ఏమైనా అలా చెప్పారా?  బీహార్ లో అధికారులు మాత్రమే చట్టానికి లోబడి పనిచేస్తున్నారా ఈ దేశంలో?  ఆంధ్రప్రదేశ్ లో చెయ్యడం లేదని ఒక్క జస్టిస్ రాకేష్ కుమార్ కు మాత్రమే ఎలా అనిపిస్తున్నదో గదా!  
 
 
“”””అధికార పార్టీకి చెందిన వారు అరాచకాలకు పాల్పడుతున్నప్పటికీ, ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఇప్పటివరకు ఒక్కరిని కూడా మందలించలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదించాలని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్రప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సూచించలేదు.”””
 
అవును!  అధికారపార్టీవారు అరాచకాలకు పాల్పడుతున్నారు.  ఏమిటయ్యా అంటే…చంద్రబాబు పాలనలో రెండేళ్ళక్రితమే జరగాల్సిన ఎన్నికలను వైసిపి ప్రభుత్వం వచ్చాక జరపాలని నిశ్చయించడం అరాచకం కాబోలు….దేశంలో ఒకటి రెండు కేసులు ఉన్నప్పుడు ..తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు కూడా రాదని నమ్మి కరోనా పేరుతో ఎన్నికల కమీషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి మాటమాత్రం చెప్పకుండా ఎన్నికలు వాయిదా వెయ్యడం మాత్రం అరాచకం కాదు రాధాకృష్ణ హ్రస్వ దృష్టిలో!  ఇప్పుడు రోజూ వేలాది కరోనా కేసులు నమోదు అవుతుంటే…ఈ సమయంలో ఏకపక్షంగా ఎన్నికలు జరుపుతామని ప్రకటించడం కూడా అరాచకం కాదు మరి… 
 
 
 
“””డిసెంబర్‌ 31వ తేదీతో ఆమె పదవీకాలం కూడా ముగుస్తుంది. స్వామి భక్తి చాటుకున్నందుకు పదవీ విరమణ తర్వాత కూడా ఆమెకు ముఖ్యమంత్రి ఏదో ఒక పదవి ఇవ్వవచ్చు. ఏదో ఆశించి విధి నిర్వహణలో వెన్నెముక లేకుండా న్యాయస్థానమంటే కూడా వెరపు లేకుండా వ్యవహరించే నీలం సాహ్ని వంటి వారు ఏ పదవిలో ఉంటే మాత్రం ఏంటి?”””
 
అబ్బా.,.అబ్బా..మన రాధాకృష్ణ మానసిక పరిస్థితి బహుగా దిగజారిపోయింది.  ఇంట్లోవారినైనా గుర్తుపడుతున్నాడో లేదో ?  చంద్రబాబు కూడా ఐవైఆర్ కృష్ణారావు గారు పదవీ విరమణ చెయ్యగానే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు.  ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పదవీ విరమణ చేసిన తరువాత ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన డాక్టర్ రాజీవ్అ శర్మకు  ఆ తరువాత సలహాదారు పదవిని కట్టబెట్టారు.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినవారికి గవర్నర్ గా, రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించింది మోడీ ప్రభుత్వం.  మరొక విషయం ఏమిటంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ విచారణకు ఆదేశించిన జస్టిస్ కక్రూ కు పదవీ విరమణ చేసిన ఇరవైనాలుగు గంటలు తిరగకముందే రాష్ట్ర మానవహక్కుల కమీషన్ చైర్మన్ గా పదవితో సత్కరించారు.  అంటే రాధాకృష్ణ గారి సిద్ధాంతం మేరకు పై అధికారులు, న్యాయమూర్తులు వెన్నెముక లేనివారు…స్వామిభక్తి చాటుకున్నవారు!  భేష్!  
 
 
 
“”””రాష్ట్రంలో జరుగుతున్న చట్టవ్యతిరేక చర్యల పట్ల బిహార్‌కు చెందిన రాకేష్‌ కుమార్‌ ఇంత ఆవేదన చెందాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రజలు, మరీ ముఖ్యంగా అధికారులు గ్రహించగలిగితే ఆయన పడుతున్న ఆవేదనకు సార్థకత లభిస్తుంది. లేని పక్షంలో ప్రజలే ఎప్పుడో ఒకప్పుడు పశ్చాత్తాపం చెందుతారు!”””
 
రాష్ట్రంలో చట్ట వ్యతిరేక చర్యలు జరుగుతుంటే అందుకు ఫలితం అనుభవించేది ఆ ప్రభుత్వం  మాత్రమే.   తరువాతి ఎన్నికల్లో  వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో రాష్ట్ర ప్రజలు చూసుకుంటారు.  తమముందుకు ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలవలన పిటీషన్లు వేస్తె వాటిని విచారించి చట్టాన్ని, న్యాయాన్ని కాపాడటమే న్యాయవ్యవస్థ విధి.  అంతే తప్ప ఎక్కడో ఎవరో ఒక కానిస్టేబులు ఎవరినో కొడితేనో, ఎవరో ఒక గుమస్తా ఎవరిదగ్గరో లంచం తీసుకుంటేనే అందుకు ముఖ్యమంత్రిని బహిరంగంగా నిందించడం, అసందర్భ వ్యాఖ్యలు చెయ్యడం కచ్చితంగా ప్రతిపక్షాలకు మేలు కలిగించడం కోసమే అనేదాంట్లో సందేహం లేదు.   న్యాయమూర్తులు తమ పరిధిని దాటి వ్యవహరించరాదు.  ఎవరు చెయ్యాల్సిన పని వారు చెయ్యాలి.  అవతలి వ్యవస్థలో కూడా తాము వేలు పెడతామంటే ఎలా?  ఆంధ్రప్రదేశ్ లో అధికారులు, ప్రజలు పడే ఆవేదనకు చింతించాల్సిన అవసరం జస్టిస్ రాకేష్ కుమార్ కు ఎంతమాత్రం లేదు.  ఆయన నిజాయితీపరుడే కావచ్చు.  అంతమాత్రాన ఇతరుల అధికారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఆయనకు రాజ్యాంగం ప్రసాదించలేదు.   చంద్రబాబుకు అధికారాన్ని అప్పగించడం ఘోరమైన అపచారం అని ప్రజలు పశ్చాత్తాపం చెందే జగన్మోహన్ రెడ్డికి అధికారం అప్పగించారు ప్రజలు అని రాధాకృష్ణ గ్రహించడం ఆయన ఆరోగ్యానికి మంచిది.  కొసమెరుపు ఏమిటంటే…జస్టిస్ రాకేష్ కుమార్ అనడానికి బదులుగా “రాకేష్ కుమార్” అని అగౌరవంగా రాధాకృష్ణ సంబోధిస్తున్నాడంటే….వారి మధ్య ఎంత చనువు ఉన్నదో అని ప్రజలు సందేహిస్తారు.  న్యాయమూర్తులను గౌరవించడం నేర్చుకోవాలి రాధాకృష్ణా!  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు