టాలీవుడ్ సినిమా దగ్గర తన మొదటి సినిమాతో మెగా ఫోన్ పట్టి అప్పట్లోనే హీరోయిన్ గా మొదటిసారి ఒక కోటి రూపాయల రెమ్యునరేషన్ ని అందుకున్న హీరోయిన్ గా రికార్డు సెట్ చేసిన హీరోయిన్ ఇలియానా. అయితే ఇపుడు తన స్టార్ స్టేటస్ పోగొట్టుకొని ఏవో కొన్ని సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది.
అయితే ఇలియానా ఇప్పుడు ఎలా ఉందో కూడా అందరికీ తెలిసిందే. అప్పట్లో నాజూగ్గా ఉండే ఈ యంగ్ బ్యూటీ ఇప్పుడు బబ్లీ గా మారిపోయింది. అయితే తన పర్సనల్ లైఫ్ లోనే ఎక్కువగా బిజీగా ఉన్న తాను లేటెస్ట్ గా అయితే పెట్టిన ఓ పోస్ట్ షాకింగ్ గా మారి వైరల్ అవుతుంది.
కాగా ఇలియానా అయితే తాను తల్లి కాబోతున్నట్టుగా ఓ పోస్ట్ పెట్టింది. అలాగే తన మెడలో మామా అనే లాకెట్ దీనితో పాటుగా ఓ తీ షర్ట్ పై కొత్త అడ్వెంచర్ స్టార్ట్ అంటూ పోస్ట్ చేసింది. దీనితో ఆమె ప్రెగ్నెంట్ అంటూ తెలిపింది. ఐతే ఇది ఒక్కసారిగా షాకింగ్ గా మారింది. ఇంకా పెళ్లి కూడా చేసుకోని ఇలియానా ఎలా ప్రెగ్నెంట్ అయ్యింది చెప్మా! అంటూ అంతా ఆలోచిస్తున్నారు.
అయితే దీనికి తన తోటి నటులు కంగ్రాట్స్ చెప్తుండడం మరో హైలైట్ అని చెప్పాలి. అయితే ఇది ప్రెగ్నెన్సీ కాకపోవచ్చని కూడా లేదు. ఏమో తాను ఎవరినైనా అడాప్ట్ చేసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదు కదా? ఏది ఏమైనప్పటికీ ఇలియానా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.