మెగాస్టార్ తో నటించే అవకాశం కొట్టేసిన గోవా బ్యూటీ

megastar chiranjeevi acharya movie script work delayed

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలకి ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్న ఆయన.. ఆ తర్వాల లూసిఫర్, వేదాళం రీమేకులు ఓకే చేసిన సంగతి తెలిసిందే. లూసిఫర్‌ కోసం తమిళ దర్శకుడు మోహన్‌ రాజా రంగంలోకి దిగుతున్నాడు.

ఈ ప్రాజెక్టు కోసం గతంలో సుజీత్, వి.వి.వినాయక్ పనిచేసినా.. స్క్రిప్ట్ విషయంలో తేడాలు రావడంతో తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టు చివరికి మోహన్‌ రాజా చేతికి చిక్కింది. చిరు చెప్పిన మార్పులన్నీ చేసిన మోహన్‌ రాజా వినోదాత్మకంగా, కమర్షియల్‌గా స్టోరీని మార్చేశారట. తెలుగులో సీనియర్ హీరోలంతా 60వ పడిలోకి వెళ్లడంతో వారికి హీరోయిన్లు దొరకడం లేదు.

ఒకవేళ యంగ్ హీరోయిన్లు ఓకే చెప్పినా.. వారి పక్కన మరీ చిన్నగా కనిపిస్తున్నారు. దీంతో కాస్త సీనియారిటీ ఉన్న ఇలియానా అయితే మెగాస్టార్‌ పక్కన బాగుంటుందని అనుకుంటున్నారట. ప్రస్తుతం ఇలియానాకు ఖాళీ ఉండటంతో డేట్స్ ఈజీగా దొరుకుతాయని భావిస్తున్నారు.