గోవా బ్యూటీ హల్ చల్ అంతా ఇంతా కాదు..!?

Ileana in Fiji beach

సినిమాల క‌న్నా ఫోటోల‌తోనే ఫోజులిస్తూ గోవా బ్యూటీ ఇలియానా త‌న సెకండ్ ఇన్నింగ్ లో తెగ  హల్ చల్ చేసేస్తోంది.  ఎక్కువ‌గా అంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తుంది. త‌ర‌చుగా ఫోటో షూట్ లు  చేస్తూ ఉండే ఈ అమ్మ‌డు ఆ ఫోటోల‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఫుల్ థ్రిల్ చేస్తుంది.  

Ileana in Fifi Beach

రీసెంట్‌గా ఇలియానా, త‌న‌ అందం గురించి ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ చేసింది. చూసే కళ్లను బట్టి అందానికి సంబంధించిన దృష్టికోణం మారిపోతుందని వివరించింది. తాజాగా ఫిజి అనే ద్వీపంలో దిగిన ఫోటోల‌ను షేర్ చేసింది ఇలియానా.  ఆ ఫోటోల‌లో ఇసుక‌లో రిలాక్సు  అవుతున్న‌ట్టు క‌నిపిస్తుండగా, చుట్టూ నీరు ఆ వెనుకు ప‌ర్వ‌తాలు, మేఘాలు క‌నిపిస్తున్నాయి. హాలీడే టూర్‌ని ఇలియానా బాగా ఎంజాయ్ చేస్తుంద‌ని నెటిజ‌నులు  చాలా కామెంట్ లు  పెడుతున్నారు.  

చివరిగా పాగ‌ల్‌పంతి చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ఇలియ‌నా .. అభిషేక్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి ఓ సినిమా చేసింది. ఈ చిత్రంలో ఓటీటీలో విడుదల కానుంది. అయితే ఇప్పుడు తన ఆలోచన అంతా సినిమాల మీద లేదని తెలుస్తోంది అంటున్నారు ఆమె సన్నిహితులు. మరి దేని మీదో? అది మాత్రం చెప్పడం లేదెవ్వరు?! ఎందుకో మరి!?