‘గోవా బ్యూటీ’ ఇలియానా బాలీవుడ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అడపాదడపా విజయాలు అందుకున్నా ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు.. డిమాండ్ మాత్రం పెరగలేదు.
దీంతో ఓటీటీలపై దృష్టి పెట్టాలని ఇలియానా డిసైడ్ అయిందట. ‘నెట్ ఫ్లిక్సు’, ‘ఆల్ట్ బాలాజీ’ వంటి సంస్థలతో ఇలియానా డీల్ కుదుర్చుకునే పనిలో పడిందట. ఓ వెబ్ సిరీస్‌లో నటించడంతోపాటు.. మరో వెబ్ సిరీస్‌ను నిర్మించాలని ప్లాన్ చేస్తోందట.
దక్షిణాదిన కూడా ఇలియానాకు గుర్తింపు ఉండడం ఆమెకు ప్లస్ అయ్యింది. దాంతో ఓటీటీలు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నట్టు సమాచారం. ఇలియానా నటిస్తానంటే.. భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కొన్ని నిర్మాణ సంస్థలు సిద్ధంగానే ఉన్నాయట. దీంతో ప్రస్తుతానికి సినిమాలను పక్కనపెట్టి వెబ్ సిరీస్‌లే చెయ్యాలని ఇలియానా నిర్ణయం తీసుకుందట.
హన్సిక ఉక్కిరిబిక్కిరి అవుతోందట!?
”నా బుర్రలోని ఆలోచనలు నన్ను మానసికంగా ఎంత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ ఒక్కసారి నేను వర్కౌట్ చేయడం ప్రారంభిస్తే అవన్నీ మాయమైపోతాయి. అంతేకాదు నా లక్ష్యానికి నేను మరింత దగ్గరగా వస్తున్నానన్న భావన కలుగుతుంది” అంటోంది అందాలతార హన్సిక.
‘వ్యాయామానికి రోజూ ఎంత సమయం కేటాయిస్తారు? అని అడిగితే – ”ప్రస్తుతం ఆన్‌లైన్ వర్కౌట్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ప్రతి రోజూ ఓ కొత్త వర్కౌట్‌ను ట్రై చేస్తున్నాను. నా వర్కౌట్ సమయం అన్ని రోజులూ ఒకేలా ఉండదు. ఒకరోజు 75 నిమిషాలు, మరో రోజు 45 నిమిషాలు.. ఇలా రోజు రోజుకీ తేడా ఉంటుంది.
ఒక్కో రోజు జస్ట్ యోగా మాత్రమే చేస్తాను. ఫిట్‌గా ఉండటానికి, మానసిక ఆరోగ్యం బాగుండేందుకు మీరు కూడా వర్కౌట్ చేసి చూడండి. వచ్చే ఫలితం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది” అని అంటోంది.