డాన్స్ ఐకాన్ షో కోసం రమ్యకృష్ణ తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బుల్లితెరపై మాత్రమే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున తెలుగు ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ఆహా వేదికగా ఎన్నో టాక్ షోలు, సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలు, ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేశాయి. ఇక ప్రస్తుతం ఆహా వేదికగా డాన్స్ ఐకాన్ అనే డాన్స్ షో ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమానికి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, వెండితెర నటి రమ్యకృష్ణ న్యాయ నిర్ణయితలుగా వ్యవహరిస్తున్నారు.రమ్యకృష్ణ సినిమా ఇండస్ట్రీలో ఆగ్ర తారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనంతరం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఈ డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి ఈమె భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.

మరి డాన్స్ ఐకాన్ షో కోసం రమ్యకృష్ణ ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయానికి వస్తే.. ఒక్క షో కోసం ఏకంగా 4.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది.ఈ వార్తలలో ఇంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇదే కనుక నిజమైతే ఇప్పటివరకు ఏ జడ్జి కూడా తీసుకోనటువంటి రెమ్యూనరేషన్ రమ్యకృష్ణ అందుకు అంటున్నారని చెప్పాలి. ఈ కార్యక్రమానికి ఓంకార్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు.