ఉర్ఫీ జావేద్ పరిచయం అక్కర్లేని పేరు. వింత డ్రెస్సులు, విచిత్ర వేషధారణతో నిత్యం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటుంది. తాజాగా ఈ సోషల్ మీడియా స్టార్ ఓ వీడియో పోస్టు చేసి చిక్కుల్లో పడింది. ఏకంగా ముంబై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే..? ఉర్ఫీ జావేద్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
ఓ కేఫ్‌లో ఉర్ఫీని ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్తున్నట్లు ఉంది. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు..? అని ఉర్ఫీ ప్రశ్నించగా.. ‘ఇంత చిన్న చిన్న బట్టలు వేసుకుని ఎవరైనా తిరుగుతారా..?’ అంటూ పోలీసులు సమాధానమిస్తారు. ఇందుకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అయింది. నెటిజన్లు దీనికే అరెస్ట్ చేస్తారా..? అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు.
దీనిపై ముంబై పోలీసులు స్పందించడంతో చివరికి వీడియో వెనుక ఉన్న అసలు నిజం బైటపడిరది. అది ఫేక్ వీడియో అని తేలింది. అందులో ఉన్న పోలీసులు కూడా ఫేక్ అని స్పష్టమైంది. మరోవైపు ఈ ఘటనకు ముంబై పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఉర్ఫీతోపాటు, వీడియోలో ఉన్న వారిపై క్రిమినల్ కేసులు బుక్ చేశారు.
పబ్లిసిటీ కోసం ఇలా చట్టంతో ఆటలాడటం మంచిదికాదని అన్నారు. ఈ వీడియోలో పోలీస్ యూనిఫాం, సింబల్స్‌ను దుర్వినియోగపరిచినందుకు గానూ వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. వారిపై ఓషివారా పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ 171, 419, 500, 34 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడిరచారు.