M.M Keeravani: హగ్గులు.. కిస్సులు ఫోర్న్ స్టార్ తో కీరవాణి ముచ్చట్లు.. ఆడుకుంటున్న నెటిజన్స్!

M.M.Keeravani: ఇటీవల కాలంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గురించి ఎన్నో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాడుతా తీయగా కార్యక్రమంలో భాగంగా సింగర్ ప్రవస్తి కీరవాణి పట్ల అలాగే సునీత పట్ల ఎన్నో విమర్శలు చేయడంతో ఈ వివాదం కాస్త సంచలనంగా మారింది. అయితే తాజాగా కీరవానికి సంబంధించిన ఒక ఓల్డ్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంగీత దర్శకుడు కీరవాణి, పోర్న్ స్టార్ మియా ఖలీఫాకు సంబంధించిన ఓల్డ్ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీంతో కీరవాణిపై భారీ ట్రోలింగ్ జరుగుతుంది.

ఇంతకీ విషయం ఏంటంటే.. ఇప్పుడే గాడ్ సెక్స్ ట్రుత్ ఫుల్ వీడియో చూశానని.. మ్యూజిక్ తనపై బాగా ఇంపాక్ట్ చూపిందని.. దీన్ని మాటల్లో వర్ణించలేనని చెప్తూ కీరవాణికి థాంక్స్ చెప్పింది మియా ఖలీఫా. నిజంగా అమేజింగ్ అంటూ.. హగ్స్, కిస్సులు పంపిస్తున్నానని తెలిపింది. ఇలా మియా చేసిన ఈ పోస్టు పట్ల కీరవాణి స్పందిస్తూ..థాంక్యూ మియా అని తెలుపుతూ ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చాడు. దీంతో నెటిజన్లు.. ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. అంకుల్ ఆన్ ఫైర్, ముసలోడే కానీ మహానుభావుడు అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఇలా వీరిద్దరికి సంబంధించిన ఓల్డ్ వీడియోని ప్రస్తుతం వైరల్ చేయడంతో తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటుంది. కీరవాణి ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన త్వరలోనే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అలాగే విశ్వంభర సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక RRR సినిమాకు గాను కీరవాణి ఆస్కార్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.