ఆర్ ఆర్ ఆర్.. సినిమా మీదే ఇప్పుడు ప్రతీ ఒక్కరి ధృష్టి ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ .. మెగా పవర్ స్టార్ రాం చరణ్ పోరాట యోధులుగా నటిస్తున్నారు. ఇక రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. బాహుబలి లాంటి సినిమాల తర్వాత వస్తున్న ఆర్ ఆర్ ఆర్ ని హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తగ్గకుండా దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీం గా .. రాం చరణ్ అల్లూరి సీతా రామరాజుగా ఎంతో శక్తివంతమైన పాత్రలు పోషిస్తున్నారు.
అయితే రాజమౌళి ఈ సినిమా విషయంలో ఒక్క అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి పడుతోంది. లాక్ డౌన్ కారణంగా దాదాపు 8 నెలలు ఆగిపోయిన చిత్రీకరణ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం అయి శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. చెప్పాలంటే చాలా నెలలు షూటింగ్ నిలిచిపోవడం తో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ని రాత్రింబవళ్ళు జరుపుతున్నాడు. దాంతో అందరూ ఈ సినిమా ఖచ్చితంగా సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తారని కలలు కన్నారు.
కాని రీసెంట్ గా రాం చరణ్ కి కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కి బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే గండిపేట దగ్గర ప్రత్యేకమైన సెట్ ని నిర్మించారు. ఈ సెట్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ ల మీద కీలక సన్నివేశాలని తెరకెక్కించాలని రాజమౌళి షెడ్యూల్ ప్లాన్ చేయగా ఇప్పుడు ఆ షెడ్యూల్ కి బ్రేక్ పడిందట. ఇక రాం చరణ్ మళ్ళీ ఆర్ ఆర్ ఆర్ సెట్స్ లో అడుగుపెట్టేందుకు 15 రోజులు సమయం పడుతుందని అంటున్నారు. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య కి రాం చరణ్ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఆ ప్లాన్స్ అన్ని కాస్త మారినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ ప్రభావం ఆర్ ఆర్ ఆర్ మీద సమ్మర్ లో రిలీజ్ అనుకున్నది విజయదశకి వెళ్ళేలా ఉందని అంటున్నారు. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మార్చ్ వరకు ఆగాల్సిందే అని తెలుస్తోంది.