సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులకి ఉండే క్రేజే వేరు చేసినవి ఒకటి రెండు సినిమాలైనా కూడా అభిమానుల గుండెల్లో నిలిచిపోతారు. వాళ్లు పెద్దయ్యాక సినిమాలు తీస్తుంటే ఆ చిన్నపిల్లలు ఇంత పెద్ద అయిపోయారు అంటూ ఆశ్చర్యపోతారు అభిమానులు ఇప్పుడు అలాంటి ఆశ్చర్యం లోనే ఉన్నారు కొందరు అభిమానులు. అసలు విషయం ఏమిటంటే అరుంధతి సినిమాలో బుల్లి అరుంధతిగా నటించిన దివ్య నగేష్ అందరికీ గుర్తుండే ఉంటుంది.
తన నటనతో మంచి ప్రతిభని కనబరిచింది అందుకుగాను ఆమె బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు సైతం అందుకుంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆమె ఎంగేజ్మెంట్ చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. తన సహనటుడు కొరియోగ్రాఫర్ అయినా అజి కుమార్ తో చాలా గ్రాండ్గా నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 20 20 లో మెంటీగా పరిచయమైన అజీ 20 21 లో స్నేహితుడిగా మారారని ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్ గా ఆత్మీయుడుగా మారాడని..
ఇప్పుడు కాబోయే భర్తగా మారాడంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది దివ్య నగేష్. తనుకు కష్ట కాలంలో ఎంతో అండగా నిలిచిన అజి ఇప్పుడు తనకు జీవిత భాగస్వామి కాబోతుండడం ఎంతో సంతోషంగా ఉందంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ భామ. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే 2005 లో వచ్చిన అన్నియన్ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది 2009లో అరుంధతి సినిమాలో చిన్ననాటి జేజమ్మ క్యారెక్టర్ లో నటించి అందరి ప్రశంసలు అందుకుంది.
2011లో పాసకార నన్ బరాగల్ అనే సినిమాలో నటించింది ఆపై రెండు మూడు సినిమాలు నటించిన పెద్దగా సక్సెస్ కాకపోవటంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నానంటూ ఎంగేజ్మెంట్ ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టింది దాంతో ఆమె అభిమానులు బుల్లి జేజమ్మ అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందా అంటూనే ఆ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.