లైగర్ సినిమా నాకు చాలా బాగా నచ్చింది.. లైగర్ సినిమాపై రష్మిక కామెంట్స్ వైరల్!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.భాషతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలను అందుకొని వరుస షూటింగ్ లతో ఎంతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ హిందీలో నటించిన గుడ్ బై సినిమా ఈ నెల 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ విజయ్ దేవరకొండ ప్రస్తావన తీసుకువచ్చింది.

ఈ సందర్భంగా ఈమె విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ తామిద్దరం కలిసి డియర్ కామ్రేడ్ గీతగోవిందం సినిమాలో నటించామని అప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామని తెలిపారు. ఇకపోతే తాజాగా విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా తనకు చాలా బాగా నచ్చిందని తనకు మాస్ సినిమాలంటే చాలా ఇష్టం అంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.లైగర్ సినిమా చూస్తూ తాను విజిల్స్ వేయడమే కాకుండా డాన్స్ కూడా చేశానని ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ విధంగా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నటువంటి లైగర్ సినిమా రష్మిక తనకు నచ్చిందని చెప్పడంతో మరోసారి విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్ పై పలువురు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు నాలుగు సినిమాలలో నటించిన రష్మిక గుడ్ బై సినిమా ద్వారా మొదటిసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈమె తన డెబ్యూ మూవీ ద్వారా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో తెలియాల్సి ఉంది.