రెండు బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకున్న విజయ్ దేవరకొండ?

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోగా పలు సినిమా అవకాశాలను అందుకొని తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ.ఈయన హీరోగా నటించిన సినిమాలు మంచి విజయం సాధించడంతో అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందారు.ఇలా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఏకంగా లైగర్ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా ఈయన మాత్రం విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇకపోతే లైగర్ సినిమాలో విజయ్ ఆటిట్యూడ్ కు ఫిదా అయినటువంటి బాలీవుడ్ నిర్మాతలు విజయ్ దేవరకొండకు ఏకంగా రెండు సినిమాలలో అవకాశాలు కల్పించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కరణ్ జోహార్ ఓ డైరెక్టర్ తో కలిసి విజయ్ దేవరకొండను సంప్రదించారని సమాచారం. అదేవిధంగా మరొక నిర్మాణ సంస్థ అయినటువంటి రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ కూడా విజయ్ దేవరకొండను కలిసి ఆయనతో సంప్రదింపులు చేశారని తెలుస్తోంది.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు బడా నిర్మాణ సంస్థల నుంచి ఈయన అవకాశాలను అందుకున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో జనగణమన సినిమా కూడా షూటింగ్ వాయిదా పడింది. ఇక ఈయన శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా ఖుషి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా పలు షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.