సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రౌడీ హీరో..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత కొన్ని సంవత్సరాల నుంచి వరుస ఫ్లాప్ సినిమాలతో ఎంతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఈయన ఒక మంచి హిట్ కొట్టాలన్న కసితో సినిమాలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనటువంటి లైగర్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఈ ఆశలన్నీ ఆశలుగానే మిగిలిపోయాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా తర్వాత ఈయన తన సినిమాల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకొని కథలను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే లైగర్ సినిమా అనంతరం విజయ్ దేవరకొండ సమంతతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే యేడాది విడుదల కానుంది.ఇకపోతే ఈ సినిమా అనంతరం ఈయన గౌతం తిన్ననూరి దర్శకత్వంలో చేయబోతున్నట్లు సమాచారం.గౌతమ్ రామ్ చరణ్ కోసం ఒక కథను సిద్ధం చేసుకున్నారట అయితే రామ్ చరణ్ కు వీలు కాకపోవడంతో అదే కథతో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా అనంతరం విజయ్ దేవరకొండ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.నిజానికి శేఖర్ కమ్ముల తన సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించే అవకాశాన్ని విజయ్ దేవరకొండకు కల్పించారు. అయితే నేడు ఆయన హీరోగా సినిమా చేయడం విశేషం.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరోగా సినిమా చేయబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.